ఏమి చేయమందువే చెలి ?
కలనైన వదలనంటివి
నా నీడనై ఉంటినంటివి
నీ గుండె సవ్వడి నేనంటివి
ప్రేమ అంటివి,
రెస్పెక్టు అంటివి,
నిజంగా నమ్ము అంటివి ...
మాటలన్నీ అబద్దాలు అయ్యాయా
నేను లేని జీవితం వ్యర్ధమంటివి
చివరికి .....
పాత మిత్రుడు ఉన్నాడు
నన్ను మర్చి పొమ్మంటివి
ఒక్క మాటతో గుండెలో మంట రేపితివి
నువ్వు మిగ్ల్చిన కన్నీళ్ళతో ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నా
నువ్వు లేని జీవితం నీరే ఆజ్యమై మరింత దహిస్తుంటే
ఆర్పే నీ చెయ్య అందనంత దురాన ఉంటె
ఏమి చేయమందువు అర్దంకావడంలేదు
నీ జ్ఞాపకాల్ని మరువలేని నా మనసుని