Friday, January 28, 2011
కుమిలిపోతున్న నా మనుసుని ఓదార్చలేక..?
నా గెలుపు ..ఓటములు .. వెతుకుతూ ..
నా ప్రేమ తో ఘర్షణ పడతు ...
కుమిలిపోతున్ననా మనుసుని ఒధర్చలేక
నాకు నేను వేసుకునే శిక్ష గుండె కోత
నన్ను నమ్ముకుని న వెనువెంట వొచ్చిన
నా చెలియా ప్రేమ గొప్పదా ?
ఏ బంధాని తేన్చుకోవాలి
మరి ఏ బంధాని కలుపుకోవాలి
నా ప్రేమ కు ఉపిరి పోసి
నాలో ఉన్న ప్రేమను కడతేర్చుకోనా ?
లేక నా ప్రేమను సమాధి చేసి
నన్ను నేను ధహించుకోనా ?
ఏ ప్రేమ ను బ్రతికించాలి ?
ఏ ప్రేమ కు స్పందించాలి ?
నమ్ముకున్న ప్రేమను శాసించాలా?
నమ్మకముంచుకున్న ప్రేమను గెలిపించాలా ?
బంధాల మద్యి ,
ప్రేమ అనురాగాల సంఘర్షణల మద్యి
ఉపిరాడక నలిగిపోతున్నా
నా మనసుకి , నా ప్రేమకి
న్యాయం చేయలేని నేను
కాని లోకానికి దూరం గా పయనం సాగిస్తున్నా ...
Labels:
కవితలు