Monday, January 17, 2011
మెడ వంపులోనో నడుము మడతపైనో..
కళ్ళూ కళ్ళూ కలవగానే
సిద్ధంగా ఉన్న సగం నవ్వు
పెదవులపైకి జారుతుంది...
అలసట జతగా తెచ్చుకున్న అసహనం
మాటల్ని ముక్కలు చేసి విసిరేస్తోంది..
మెడ వంపులోనో నడుము మడతపైనో
ఎదపై నిలవనంటున్న పైటసాక్షిగా..
నడిరేయిన వేలికొసల పలకరింపులు..
నిర్లిప్తత వాగు దాటాలంటే
శరీరాలు మాట్లాడుకోక తప్పదనుకుంటా!
స్పర్శ ఇచ్చిన భరోసానేమో
నా హృదయమంతా నీ ఊపిరిగా మారింది!
నిద్రదుప్పటి కప్పుతున్న నీ పరిమళం సాక్షిగా
ఒక్కమాట తీసుకోనీ..
నిజం కాని నిజంలా..
ఊహల తీరంలో విహరిస్తున్నాను నేను..
చీకటిని కాకున్నా ప్రతి వేకువనీ
కలిసే ఆహ్వానిద్దాం .. గతం సాక్షిగా
ఇవన్నీ ఊహలే నిజాలు కాదు..
నిజాలు అయ్యే అవకాశం అస్సలేలేదు..
కాని ప్రతి క్షనం నీ జ్ఞాపకాలు వెంటాడు తుంటే..
ఏంటో చిలిపి కోరికలు చిందులు తొక్కుతున్నాయి..విరహంలో వెర్రి అలోచనలంటే ఇవేనేమోకదా..?
Labels:
కవితలు