Wednesday, January 12, 2011
కన్నీటి సుడిగుండంలో చిక్కుకుని..కలత చెందినప్పుడు
కన్నీటి సుడిగుండంలో చిక్కుకుని
కలత చెందినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.
ధైన్యంలొ కూరుకొని
దీనంగ మిగిలినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.
చీకటంత అలుముకుని
శూన్యంగ మిగిలినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.
గాయాలకు తాలలేక
గమ్యాన్ని మరిచినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.
మౌనంలొ మునిగిపోయి
మదన పడినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.
ఎన్నని చెప్పను నేస్తం....
నన్ను నడిపిన నీ గూర్చి
తెలుసా నేస్తం.... నీ స్నేహం నా పాలిట వరం..
ఇప్పుడునన్ను వంటరివాడిని చేశావు మిత్రమా...?..
నీ ఆలోచనలు నన్ను ప్రతిక్షనం వెంటాడుతున్నాయి మిత్రమా..?
ఈ గొంతులో ప్రాణం ఎప్పటిదకా ఉంటుందో చెప్పలేను మిత్రమా..?..
ఆ చివరిక్షనాలు నీకు తెల్సే అవకాశం కూడా లేదేమో..?
నీ ఆనందాన్ని నేనెందుకు చేదగొట్టాలి అందుకే మౌనంగా ఉన్నా మిత్రమా..