Thursday, January 20, 2011
కలువలేమని తెలిసి నా మనసు చేరని అనురాగం ప్రేమ కాదా?..ఎక్కడికి దూరంగా పోతావు
ఇష్టం లేదనే,ప్రేమలేదని చెప్పే నీ మాటలతో,
నీ పెదవి ఒణుకు ప్రేమ కాదా?
గెలవలేమని తెలిసి నీ గుండెదాటని,
కలువలేమని తెలిసి నా మనసు చేరని అనురాగం ప్రేమ కాదా?
తడి ఆరని నీ కనుపాపల మాటున,
మసకబారిన నా రూపం దాచుంచడం ప్రేమ కాదా?
అది దాటిరాలేక దుఖంలో నీవు,
నిను చేరుకోలేక చేతకాని వాడిలా నేను......
ఇష్టం లేదన్న మీమాటల్లో నిజాయితీ ఎంతో నాకు తెలియదా..?
ఎవ్వరికో భయపడుతూ ఓ మనిషిని గుడెకోతకు గురిచేస్తున్నానని నీకు తెల్సు..?
జీవితాలు శాస్వితంకాదు మనస్సులో భావాలు శాస్వితం..అని నీకు తెలీదా..?
నమ్మకం అనే మెక్కను నేను ఏనాడు తుంచలేదు..అని నీకు తెల్సా..
ఆ చెట్టును ఎవరో పెకల్చి వేసి..నేనే అని నీముందు నిరూపించారు నీవు నమ్మావు..
ఒకసారి నీవు నమ్మిన తరువాత...మళ్ళీ నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు..
నమ్మావో నమ్మినట్టు నటించావో నంటూ..కారణాలు వెతుక్కుంటూ కూర్చోనా..
ఏంజరుగుతుందో ..ఏం జరుగ బోతుందో..అర్దంకావడం లేదు..
నిన్ను ఏమి అనలేను మౌనమే నాకు నేను వేసుకున్నశిక్ష...ఎన్నాళ్ళిలా ఏన్నేళ్ళిలా..మిత్రమా
నాకు దూరంగా వెళ్ళగలవేమోగాని నామనస్సునుంచి పోవడం నీకు సాద్యింకాదని తెల్సుకో
Labels:
కవితలు