ఎన్నో ఆలోచనలు…..గతకాలపు జ్ఞాపకాలు….
అక్షర రూపం ఇద్దామంటే పదాల అమరిక
పరుగిడిపోయింది అందనత దూరంగా ….
నీవు లేవన్న నిజాన్ని తట్టుకోలేక……
నీవు లేవని తెలిసిన క్షణం కాలమాగిపోలేదు
ప్రపంచమూ స్థంభించిపోలేదు....కాని...
నేను స్తబ్దుగా అయిపోయాము...
నిర్లిప్తంగా... శూన్యంగా ...
మూగగా రోదించే మనసుకి
మరపు రాని నీ జ్ఞాపకాలతో
నీవు అనునిత్యం నాతో ఎప్పటికీ ఉంటావన్నది నిజంకాదని తెల్సి..
తిరిగిరాని లోకాలకు అనుకోకుండా వెల్తున్నామిత్రమా!!