. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, January 29, 2011

వెర్రి గొంతుకతో కసాయి గుండెలు కరిగేలా...విలపించనీ



ప్రేమా ప్రేమా ప్రేమా, ఏదమ్మా ఎక్కడ వెదకను నీచిరునామా...
ప్రేమా ప్రేమా ప్రేమా, రాస్తుందా ఈతరం రక్తాక్షరాల వీలునామా...
రమణుల దేహాలపై రక్కసి రసాయనపు దాడిలోనా.?
సుకుమారపు కుసుమాల కుత్తుక తెగవేతలోనా?
ధరణిని తలపే తరుణి దహనపు దావానలంలోనా?
ఎక్కడ దాగింది నీ కొత్త చిరునామా ?, ఏమని చెబుతుంది నయా శవపంచనామా?


నాకే సొంతమనే స్వార్దం ప్రేమంటుంది నేటి తరం
దక్కకుంటే దహించడమే ప్రేమంటుంది నవకులం
బ్రతుకిచ్చింది బ్రతికించింది ప్రేమేనని
బలికోరే పాషాణ బలిపీఠం ప్రేమేకాదని దానికి ఆపేరేవలదని
తనుసొంతం కాకున్న సంతోషం తనకు సొంతం కావాలనే నిస్వార్దమే ప్రేమని
వెర్రి గొంతుకతో కసాయి గుండెలు కరిగేలా...నినుతెలుపనీ నినదించనీ నిలదీయనీ...

ప్రేమంటే తనదూరంతో తరిగిపోయేది కాదని
ప్రేమంటే తనుకాదన్నా చెరగిపోయేది కాదని
ప్రాణం పోసేది ప్రాణం పంచేది ప్రేమనీ ...
ప్రాణం తీసే దారుణమారణ శాసనం ప్రేమేకాదని దానికి ఆపేరేవలదని
ప్రేమనిండిన గుండెకు ప్రేమించడమే తెలుసని, ప్రేమనుపంచడమే తెలుసని
వెర్రి గొంతుకతో కసాయి గుండెలు కరిగేలా...విలపించనీ వినిపించనీ విన్నవించనీ...

మంచి మమత మానవత్వం ప్రేమమతమని
శాంతి సహనం నిస్వార్ధం ప్రేమకులమని
దయ జాలి కరుణ ప్రేమగుణమని
తెలుసుకో తరచి తరచి నిన్ను నీవు తడుముకో
నీలోదాగినది నీకేదక్కాలన్న స్వార్ధమో సంతోషం తనకు దక్కించే నిస్వార్ధమో