Monday, January 10, 2011
కలల సౌదం కన్నీటి వరదల్లో కొట్టుక పోయేట్టుంది
ప్రియసఖి !
శూన్యంకళ్ళలోని
శిథిల శిల్పానికి
చైతన్య బిందువులను అద్ది
హరిత స్వప్నాలను నాటాలని
కాంతి కణాలను
నీ రూపంగా పేర్చుకొంటూ
కలల గుండెలపై
భవిష్యత్ సంపుటులకు
జీవం పోస్తున్నా .
నా కవితకు సంగీతాన్ని మేళవించి
నీ స్వరానికి అంకితమిస్తున్నా
ఈ ఆహ్వాన గీతంతో
నా కనులలో ప్రత్యక్ష మౌతావని
వలపుల వసంతానికి
స్వాగతం పలుకుతున్నా .
కలల సౌదం కట్టుకున్నా ప్రియతమా..
అది కన్నీటి వరదల్లో కొట్టుక పోయేట్టుంది
ఎక్కడ ఉన్నావు..నా ఆత్నఘొష వినిపిస్తోందా..
అన్నీ విన్న నీవు ఎందుకలా మౌనంగా వున్నావు ..
మౌనం ఎంత నరకమో తెల్సా..
ఎటూ తేల్చలేని అదొ త్రిసుంక స్వర్గం...
ఎంతో సున్నితంగా ఉండే నీమనస్సు ఎందుకలా మారింది ప్రియా..
కాలం నన్ను కన్నీటీలో మునిగేట్టు చేస్తుంది...అది నీతప్పెలా అవుతుంది ప్రియా..