Tuesday, January 25, 2011
మది నిండా నీవే, తుది శ్వాసా నీకే అంకితం...
నాడు కనుల ముందున్నా చెప్పలేని ప్రేమ
నేడు కనుమరుగైనా చెప్పాలని వెర్రి తపన
నాడు కలవాలన్నా కలవలేని పరిస్థితి
నేడు కలవలేని అవకాశమూలేని దుస్థితి
నాడు నీ కళ్ళల్లో కన్నది నన్నే
నేడు నా గుండెల్లో దాచుకున్నది నిన్నే
నాడు నీ నవ్వుల్లో పువ్వులు వెలుగు చూశా
నేడు పువ్వుల్లో నీ నవ్వులకై ఆత్రంగా వెతికా
నాడు నీ ఊహల్లో రేపుని తలచా
నేడు నీ స్మృతుల్లో నిన్నకై వగచా
నాడు నీ వడి లో కరిగిన కాలం
నేడు బరువై కదలని అను క్షణం
నాడు విధి వరించి కలిపిన మనసులు
నేడు అది వంచించి విడదీసిన బ్రతుకులు
నాడు బంధాలకి తలవంచిన హృదయాలు
నేడు అనుబంధానికై విలపించే గుండెలు
నాడు బ్రతుకున నిరాశల కన్నా
నేడు జీవితాన ఆశలు సున్నా
అయినా నాడూ నేడూ ఎప్పుడూ ఎల్లప్పుడూ
మది నిండా నీవే, తుది శ్వాసా నీకే అంకితం...
Labels:
కవితలు