Sunday, January 16, 2011
కను రెప్పల చాటు నుండి స్వప్నాలను ప్రసవిస్తుంది..
నా కనుపాప నిశ్శబ్ధంగా..
కను రెప్పల చాటు నుండి స్వప్నాలను ప్రసవిస్తుంది..
తనకే సంబంధం లేదన్నంత అమాయకంగా..
ఆ కలల పరంపరలోనే..
మౌనంగా రోదిస్తూ నిన్ను చూస్తుంటాను మిత్రమా...
నన్ను చూసుకొంటూ నిన్ను కూడా నిశ్సబ్దంగా నిన్ను చూస్తున్నా
అంతలోనే కనుపాప ఏదో గుర్తొచ్చిన వానిలా.. చప్పున కళ్లు తెరుస్తాను..
నాకను రెప్పల శబ్దానికి మాయం అయ్యావా మిత్రమా..?
తలుక్కుమనే చుక్కల్లా కనిపించి మాయం అవుతున్నావు..
అదేంటో నేను, నేనుగానే ఉండాలనుకున్నా సాద్యింకావడంలేదు..
నీవు కనిపించినట్టే ఉంటావు కనిపించవు
రాత్రి తాలూకు స్వప్నాలను ఏరుకోవడం కోసం విఫలయత్నం చేస్తూ ఉంటాను..
స్వప్నాలు కదా..! దొరకవు.
మొదట.. నిరాశగా.. తరువాత.. రాజీ పడుతూ.. మరీసారి ఆశగా..
నివు నాతో ఉన్నది గతంఅయినా వాస్తవం కాదేమో అన్న అనుమానం ఇంకా తొలుస్తూనే ఉంది
నేను"..నేనుగానే ఉంటాను..అప్పుడు అనిపిస్తుంది నివులెని నేను నేను కాదేమో..
నీవు లేకుండా నేను నేనుగానే ఉండాలనుకుంటాను..
ఎన్నోసార్లు కాని అది సాద్యంకాదని అది వృధాప్రయత్నమే నని తెల్సింది మిత్రమా
Labels:
కవితలు