. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, January 23, 2011

అందుకే నీ నుంచి, నీ జ్ఞాపకాల నుంచి శాస్వతంగా దూరమవుతున్నా..!


కనిపించిన ప్రతి వాడిని నేనెక్కడ అని అడగమాకు
ప్రతి చోట నాకొసం వెతకమాకు.
నే నీకు కంటపడను.
ఇంకెప్పటికీ, నీకు నేను ఎదురుపడను.
అందుకనే, కనిపించిన ప్రతి చోట నాకొసం వెతకమాకుప్రతి వాడిని నేన్నెక్కడ అని అడగమాకు.
నేనెప్పుడూ నువ్వెళ్ళిన దారి వంక జాలిగా చూస్తున్నా ఎప్పటికైనా తిరిగొస్తావని.
అయినా, నాపై నీకు జాలికలగలేదు.తిరిగి నాకై నువ్వు రాలేదు.
వస్తావన్న ఆశ ఎప్పుడో చచ్చిపోయింది..ఆశ ఆశగానే మిగిలిపోయింది
అందుకే నీ నుంచి, నీ జ్ఞాపకాల నుంచి శాస్వతంగా దూరమవుతున్నా..!
నా వాకిట్లొ పూచిన ప్రతి గులాభీ పూరేఖపై నీ పేరుని రాసుంచాను.
వెన్నెల్లొ నీకొసం కనుపాపలచే వెయ్యి కలలు కనిపించాను.
ఎం లాభం? ఆ పూలన్నీ నేడు నేలకొరుగుతున్నాయి.
ఆ రెప్పలు నేడు సాస్వత నిదురలోకి జారుకుంటున్నాయి.
ఇంక, నీకొసం నే లేను.
నువ్వెవరొ? నేన్నెవరొ?
అందుకనే, నే లేనని భాదపడవని తెలుసు
ఆ నిజం తెల్సిన సమయంలో..నాకొసం కన్నీటిని వృధా చేయవనీ తెల్సు
నీవు నమ్మిందే నిజం ..నేనేమైనా "అయితే ఏంటంటా"అనేగా నీవనేది
నిర్నయం తీసుకున్నా నని నీకు తెల్సి ఆరోజుకోసం ఎదురుచూస్తున్నావు కదూ
ఒక వేళ నేను కనిపించక నాతో మాట్లాడాలని పిస్తే పలకడానికి నేనుండను కదా..
మరుజన్మకైనా మన ఇరువురిని కలపమని కాలాన్ని వేడుకుంటూ నింగికెగసి ఆ దివి అంచుల్ని నే చేరుకుంటా ..
దైవలోకపు ప్రాంగణంలొ పూచిన పూలతొ ఓ కొత్త దారిని వేసి, ఆ దారి చివరన నీకొసం ఎదురుచూస్తుంటా..!
ఏ నాటికొ ఓ నాటికి ఈ కాలమే మనని కలుపుతుంది.
ఈలొపు నువ్వు, నా సమాధిపై సన్నజాజుల్ని పేర్చకు.
నా పేరుని పదే పదే పలకరించకు.
నువ్వు పిలవగానే రాటానికి,
నేన్నున్న చోట నువ్వురాలేవు.
నువ్వున్న చోటికి నే రాలేను.
అందుకనే, నాకొసం వెతకమాకు.
అందరినీ నేనెక్కడ అని అడగమాకు.
నీకందని కనిపించని లోకానికి వెలుతున్నా నేస్తం