చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంకాదు స్నేహమంటే
జీవితంలో పైకి ఎదగడానికి మెట్టది స్నేహమంటే..
రోజూ ఒకరినొకరు చూసుకోవడంకాదు స్నేహమంటే
మనల్ని మనం అద్దంలో చూసుకుంటే గుర్తుకొచ్చేది స్నేహమంటే
కాలక్షేపానికి రోజూ కబుర్లు చెప్పుకోవడంకాదు స్నేహమంటే
గుండెలపై చేయివేసుకుంటే గుర్తుకొచ్చే అనుభూతి స్నేహమంటే
పేరు పేరునా పిలచి పలకరించుకోవడంకాదు స్నేహమంటే
పదిమందిలో మనపేరుతో పాటు పలుకరించే పదమే స్నేహమంటే
ఎన్నటికీ ఎడబాటే ఎరుగనిది స్నేహమంటే
దూరమైనా దగ్గరగా ఉన్నామన్న భావమిచ్చేది స్నేహం అంటే
కలసి ఉండాలని కలుకనడంకాదు స్నేహమంటే
భాధ ఇక్కడైతే అక్కడ కన్నీరు కార్చేదే నిజమైన స్నేహంఅంటేhttp://padma4245.blogspot.com/