Sunday, July 15, 2012
నాలో తడసి ముద్దయిపోయిన ఈ ఆలోచనా తరంగాలను ఆపలేక
ముత్యాల వాన జల్లులకోసం ఎదురుచూసే ధాత్రిలా
నీరాకకై శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాను ప్రియా
నా మది పావురంలా రెక్కలుసాచి
ఆ పచ్చటి నేలలను నీలిమబ్బులను దాటి
అనంతమైన ఈ ప్రేమతాలూకు
సూన్యంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది ప్రియా
నాలో తడసి ముద్దయిపోయిన ఈ ఆలోచనా తరంగాలను ఆపలేక
చీకటిదారులలో మగ్గిపోతున్న ఈ ఒంటరి నావని చూసి
అనంతమైన ఆ నీలిసంద్రం హోరెత్తుతోంది
పువ్వులో మకరందాన్ని
సీతాకోకచిలుకలాంటి నా ఆలోచల్ని పరిహసిస్తూ
నాలోని రక్తం నీ ఆలోచనలతో ఆవిరవుతోంది ప్రియా
గజిబిగి గందరగోళంలో ..ఆదోళన అట్టుడికిస్తోంది ప్రియా
తన గర్భాని చీల్చుకుని చొచ్చుకు వచ్చిన జలతరంగాలతో
పద్మవ్యుహాని పన్ని నన్ను తన గర్భంలోకి తీసుకుపోతోంది
నా చుటూ వ్యాపించిన ఈ జలనిశీధిలో అంతర్దానమౌతున్న నాకు
నీ జ్ఞాపకాలు తరంగగోష తప్ప మరొకటి వినిపించుటలేదు ప్రియా
అనంతమైన ఆ సముద్రగర్భంలోకి చొచ్చుకుపోతున్నా ...
నీ జ్ఞాపకాలతో తడసి పులకించాలని మది ఆరాటపడుతోంది ....ప్రియా
Labels:
కవితలు