Saturday, July 14, 2012
మరల రాని నిను చేరలేక.. నీ ప్రేమను మరువలేక...ప్రియా
నీ తలపుల జడివానను తాళలేక ప్రియా
జ్ఞపకాల సుడిగుండంలో నిలువలేక...?
మాయమాటలు చెప్పలేక.. మనస్సాక్షిని చంపి బ్రతుకలేక..
మరల రాని నిను చేరలేక.. నీ ప్రేమను మరువలేక...ప్రియా
తరలిపోతున్నా.... తిరిగిరాని మరో తీరానికి...ప్రియా
తడి ఆరని నా కనులను పరులెవ్వరికీ కానరాకూడదని
జ్వలితమైన నా హ్రుదయ సెగ మరెవ్వరికీ తాకకూడదని
నను నేనే కాల్చుకుంటూ.. ప్రియా నీ పేరే తలచుకుంటూ..
తరలిపోతున్నా.... తిరిగిరాని మరో తీరానికి...ప్రియా
మరుభూమికై మౌనంగా ఎదురుచూస్తూ...
నేడు నేను..మరొకరోజు నేనుండనేమో ప్రియా
అన్ని సౌఖ్యలూ వున్న దరిద్రుడిని..ప్రియా
అందరూ ఉన్నా నీవు లేని నేను ఏకాకినే ప్రియా
నీవులేని నేను ఎందుకు ప్రియా
జగమంత కుటుంబంలో ఏకాకిని..ప్రియా
నీకోసం ఏదో రాయాలని రాయలేక నలిగిన చిత్తు కాగితాన్ని
బ్రతికి వున్న శవాన్ని..ఓ పిచ్చివాడిని..
Labels:
కవితలు