Friday, July 13, 2012
ఏ రాత్రీ గాయానికి పూతమ౦దు కాలేదు..ఆగాయం ఇంకా పెద్దది అవుతోంది ప్రియా
ప్రతిరోజూ ఇదే అనుభవ౦..ప్రియా
గతం తాలూకా నీ జ్ఞాపకాలతో పొద్దువాలేలోపు గాయపడట౦
రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦..
నిద్రలేని రాత్రుల్లు గడపడం అలవాటైంది..ప్రియా
నా చితిమంతలు కాలేవరకు నిన్ను మరలేనని తేలింది..
ఇది ప్రతిరోజు జరిగే సన్నివేశ పునరావృత పర౦పరలో..
గొ౦తెత్తి ప్రశ్ని౦చే స౦దర్భము౦డదు..మూగగా రోదించడం తప్ప ప్రియా
మనం ఆనందంగా వున్నరోజులు తిరిగిరావని తెల్సు కాని..భాద నాకు తప్పదు..
నన్ను మర్చిపోవడం నీకు చేతనవుతుందేమో గాని అది నావళ్ళకాదని నీకు తెల్సు
ఎదురుచూపుల నమ్మక౦పై..
ద్రోహాన్ని సూదులుగా గుచ్చుతాయి ప్రియా
విరిగిన భుజాలమీ౦చి నడిచే విషాద౦..
ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోయింది..ప్రియా
ఎవ్వరు ఇలా నా విషయంలోఓదార్చలేరు ప్రియా.
ఏ ఉదయాలు గాయపడకు౦డా అడ్డుకోలేవు..ప్రియా.
ఏ రాత్రీ గాయానికి పూతమ౦దు కాలేదు..ప్రియా.
ఆగాయం ఇంకా పెద్దది అవుతోంది ప్రియా.
ఇప్పటికీ ప్రతిరోజూ ఇదే అనుభవ౦..
పాత గాయాలను ఓదార్చుకు౦టూ వెళ్ళి..
మళ్ళీ గాయపడి మోసపోవడం అవుతోంది ప్రియా
Labels:
కవితలు