Saturday, July 21, 2012
ప్రియా కళ్ళు మూసుకొని ఎప్పూడూ... నిన్ను చూస్తూనే ఉన్నా
నీ జ్ఞాపకం
ప్రియా అదే జ్ఞాపకం
పదే పదే మనస్సుని తడుముకుంటూ
ప్రియా మరిచిపోవటం అనేది
అన్నింటికీ కాదేమో
నీ జ్ఞాపకాలకు అస్సలే కాదు
ప్రియా గతం ప్రతీ రోజు తరుముతూనే ఉంది
నువ్వు ఎక్కడ ఉన్నావో వెతకమని
ప్రస్తుతం ఆపుతోంది.. ప్రతి అడుగుని
నిన్ను జ్ఞాపకం గానే ఉంచమని
ప్రియా నేను వేసే ప్రతి అడుగులో
తీసే ప్రతి శ్వాసలో
నీ జ్ఞాపకం
ప్రియా ఎక్కడో... ఎప్పుడో
నువ్వు ఎదురుపడితే
ఇదీ...అని చెప్పుకోడానికే
ఈ మాత్రం అయినా గెలిచింది
ప్రియా నాకు... ఎంత దూరంలో
నువ్వున్నావో... తెలియదు
మనస్సుకి.. ఎంత దగ్గరగా ఉన్నావో మాత్రమే తెలుసు
ప్రియా కళ్ళు మూసుకొని ఎప్పూడూ... నిన్ను చూస్తూనే ఉన్నా
ఊపిరి ఆగేలోపు.. ఒక్కసారి
కళ్ళు తెరిచి చూడాలని... ఎదురుచూస్తున్నా...
Labels:
కవితలు