Friday, July 13, 2012
ఓ క్షణం నాకు నీ కౌగిలిలో సేద తీరాలని ఉంది ప్రియా
ఓ క్షణం నాకు నీ కౌగిలిలో సేద తీరాలని ఉంది ప్రియా
అలసిపోయిన నా కనులకు జోలలు పాడే నీ పెదవుల సరిగమలు వింటూ నిదురపోవాలని ఉంది ప్రియా
నీ చూపులకు తెరలడ్డు పెట్టే నా ముంగురులు సవరించే..
నీ చేతి వేణువుల ను పెనవేయాలని ఉంది ప్రియా
ఏదో చెప్పాలని చెప్పలేక పోయినప్పుడు ...
నువ్వు నవ్వే కొంటె నవ్వులో జారి పోవాలని ఉంది ప్రియా
నే చేసిన తప్పులను సవరిస్తూ బుద్దులు చెప్పే నీ పెద్దరికానికి మరోసారి తలవంచాలని ఉంది ప్రియా
అల్లరి చేస్తూ నీ చేతికి అందకుండా పారిపోయినప్పుడు ..
ఉడుక్కునే నీ కళ్ళలో వేడి కి ఆవిరై పోవాలని ఉంది ప్రియా
కోప్పడుతూ కళ్లురిమి చూసే చూపుల చురకత్తుల దాడికి విల విల్లాడి పోగలను కాని
మౌనం వీడి నా మనసుకు ఓదార్పు నీయవూ ప్రియా ?
కరిగి జారిపోయే నీ చెలిని నీ ఎద వంపులో తల దాచుకోనీయవూ ?
వేడు కుంటున్నాను ప్రియా
నన్ను మరో సారి మన్నించవూ ?
Labels:
కవితలు