Thursday, July 12, 2012
చెప్పాలనుకున్న అవకాశాలన్నీ చేజారిపోయాయి ప్రియా
ప్రియా నీ హృదయం లోకి చూడు
నీలో నిన్ను చూస్తూనే ఉన్నా ప్రియా
నీతో ఎన్నో మాట్లాడాలని ఉంది ప్రియా
నాగుండెళ్ళో రగులుతున్న భాద చెప్పుకోవాలని ఉంది
చెప్పాలనుకున్న అవకాశాలన్నీ చేజారిపోయాయి ప్రియా
ఒకప్పుడు మనం ఇప్పుడు ఇద్దరం ఎందుకిలా..?
నిన్ను ఎదురుగా చూడలేనని తెల్సి కూడా
ఎప్పుడోకప్పుడు ఎదురుగా కూర్చొని నిన్ను చూడాలని
ఆశతీరుతుందా..ఇదో కలగానే మిగిపిపోతుందా ప్రియా
నీకోసం ఎంత పరితపిస్తున్నానో...?
నిదుర రాని నా కనులు చూడు ప్రియా
నా కనులు నీ కోసమై వెతుకుతున్నాయి
నిన్ను కావలనుకున్న ఈ బంధం
మరల మరల నిన్నే కోరుతోంది ప్రియా
నీ ఊహలే నాకు శాపమై వేదిస్తున్నాయి ప్రియా
నీకెల చెప్పను తెలుపను ప్రియా
ఆశ వదిలిన ఈ నా మనసుకు
నీరాశే తోడై నీకోసం పరితపిస్తుందని
నీకెల తెలిసేది నీకెల తెలిపేది ప్రియా
ఊహ చెదిరిన ఈ బ్రతుకునే
నీ చివరి మాటకై వేచి ఉన్నదనీ
మన మద్యి కొందరు అఘాదం సృష్టిచారు ప్రియా
నీతో ఎలా చెప్పాలో తెలియక..
నిన్ను చేరుకోలేక ప్రియా....?
పిచ్చి మనసు ఊరుకోక ఈ పిచ్చి రాతలు ప్రియా
Labels:
కవితలు