Saturday, July 7, 2012
బాధలకే నిలయం అయిన నా హృదయ అలజడిలో..నీ కోసం వెతుకుతూనే ఉంటా
బాధలకే నిలయం అయిన నా హృదయ అలజడిలో
ప్రేమ సవ్వడిని నింపావు నా ప్రాణమా...!!!
బంధమే దూరం అయిన నా జీవితం లో
అంతులేని ఆప్యాయతను పంచావు ఓ ప్రియతమా..!!!
బరువే అని నా గుండెను నిట్టుర్పులో వుంచాను
నీ ప్రేమ లో కొత్త హృదయాన్ని పరిచయం చేసి నన్ను నీవుగా మార్చావు …..
నువ్వు ఎక్కడ ఉన్నానంటే ఏం చెప్పను .......
కొన్ని నిద్ర లేని రాత్రుల్లో మేల్కొన్న ఆక్రోశం లో నీ కోసం వెతుకుతూనే ఉంటా
కొన్ని అర్ధం లేని పనులు వెతికే వెర్రి తనం లో నీ కోసం వెతుకుతూనే ఉంటా
కొన్ని భావోద్వేగాలు అదుపు తప్పిన ఉన్మాదం లో నీ కోసం వెతుకుతూనే ఉంటా
కొన్ని తీరని కోరికల ఫిర్యాదుల ఆక్రందనలో నీ కోసం వెతుకుతూనే ఉంటా.
కొన్ని గుండె చప్పుళ్ళు మొరాయించిన నిస్సత్తువ లో నీ కోసం వెతుకుతూనే ఉంటా .
కొన్ని నరాలు తెగే ఉత్కంట రక్త పీడనాలలో నీ కోసం వెతుకుతూనే ఉంటా .
కొన్ని శ్వాసలు జీవనాధరాలవ్వని అయిష్టతలో నీ కోసం వెతుకుతూనే ఉంటా ..
కొన్ని ఆశలు వెక్కిరించిన అసహాయతలో నీ కోసం వెతుకుతూనే ఉంటా ..
కొన్ని నిరాశలు ఆశ్రయమిచ్చిన అగాదాలలో నీ కోసం వెతుకుతూనే ఉంటా.
కొన్ని స్వేద బిందువులు సేద తీరే అలసటలలో నీ కోసం వెతుకుతూనే ఉంటా.
Labels:
కవితలు