ప్రియా కనురెప్ప మూసే లోపే
కలలన్నీ కల్లలవుతున్నవి
ప్రియా ఏమీ లేని చోట
ఏదో జరిగిపోతున్నట్టు
కల్మషం లేని హృదయాన్ని
కమ్ముకున్నట్టు
ఇంకా ఇంకా ప్రయాణం కొనసాగుతూనే ఉంది
ఇది ..నిరంతరమా లేక తాత్కాలికమా
అన్నది అర్థమయ్యేలోపు
అన్నీ కలగా మిగిలి పోతున్నాయి
కాలమూ జీవితమూ
కలగలిసి పరుగులు తీస్తున్నవి
ప్రియా నీజ్ఞాపకాలు.. మదిలో పదిలం
ఆజ్ఞాపకాల దొంతరలో..
కాసేపు తొంగిచూస్తే నా భాద అర్దం అవుతుంది
ప్రియా దుఖం లోంచి ..దూరం అవ్వాలనుకునే నా విఫల ప్రయత్నం
నీజ్ఞాపకాల్లా నిలచే గుండేల్లో దాగి దోబూచులాడుతున్నాయి ప్రియా