రెండు క్షణాల మధ్య మిగిలిన నిశ్శబ్దంలో ప్రియా
రెండు హృదయాల మధ్య ఒదిగిన మహాశూన్యంలో
ఒక క్షణం త్వరగా కరిగిపోతుంది ప్రియా
ఒక క్షణం శాశ్వతంగా వుండిపోతుంది
కొన్ని క్షణాలు త్వరగా కరిగిపోతే
బావుండు అనిపిస్తుంది ప్రియా
కొన్ని క్షణాలు ఎప్పటికీ అలాగే
వుండిపోతే బావుండు అనిపిస్తుంది
బావుండటానికీ
బాగోలేకపోవడానికీ మధ్య
ఉన్నదేదో తెలియక హృదయం కలవరపడుతుంది ప్రియా