ప్రియా కన్నీరు కడలయి చెక్కిలి తీరం చేరగా,
మూగబోయిన స్వరం మౌన రాగం ఆలపించగా,
ప్రియా ఆ రాగపు వేదనలో గుండెలోని నీ జ్ఞాపకాలన్నీ గువ్వలై ఎగిరిపోగా,
నా హృదయారణ్యంలో నీ ప్రేమ సమాధిపై రాస్తున్నా ఈ అక్షరాలు,
ప్రియా అక్షరాలు కావివి, నా గుండె గాయపు రక్తాశ్రువులు ....