నీకు మనసిచ్చా....నాకు కలలిచ్చావు
మనసుకు బాధ...పెదవులకు నవ్వు అలంకారంగా మిగిలింది
కన్నీరు సుడిగుండం అయినా....అందులో నీ జ్ఞాపకాలు మాత్రం పదిలం
నువ్వు, నీ చిరునవ్వే లేని చోటే కావాలి
ఊహల ఉయ్యాల నుండి కింద పడ్డాను....జీవితం అనే నిజం కనిపించింది
తుదిదాకా తోడు ఉంటావనుకున్న....తుదముట్టిస్తావనుకోలేదు
నీతోపాటు నా చిరునవ్వు కూడా తీసుకెళ్ళావు...అది ఇస్తావా....నువ్వొస్తావా?
నీ కళ్ళతో చూడాలని ఉంది...నేను కనిపిస్తానో లేదో అని
మనసు నుండి కళ్ళకి నీ ప్రయాణం....కన్నీరులా
కన్నీళ్ళకు మాటలొస్తే కనులు అలసిపొతాయేమో
నా చిరునవ్వు చిన్నబోయింది....నువ్వు వెళ్ళాక
కన్ను తడవకుండా....రోజు గడవట్లేదు
మనసంతా నువ్వే....మరి నేనెక్కడ?
సముద్రంలో నా కన్నీటిబొట్టు.....చూసారా ఎవరైనా?
మరువలేక చస్తున్నా....మర్చిపోయి చంపేసావ్
ఇచ్చినచోటే తీస్కో....ఇచ్చావని అడిగితే బాధే
కనులలో సుడిగుండాలు....మనసులోకి వరదలా
కన్నీరు మనసులోకే....బయటికి రానంటుంది
ధగ్గరవాలంటే భయం....దూరమవుతావేమోనని
జీవితం ఒక ప్రశ్న.....చావే సమాధానం
అబద్ధం చాటున నిజం ప్రశ్నిస్తున్నా....నిజాన్ని అబద్ధం చేశా చేతకాక
నీ జ్ఞాపకాల తూఫాన్....నా హృదయ సముద్రంలో సునామీగా
నీ చూపులకవ్వింపులో....లేవలేకపోయా జీవితమంతా
నీకు నాకు దూరం...కనురెప్పలు మూసి తెరిచే కాలం....
తన విజయం నా కన్నీరు........నా కన్నీరే తన ఓటమి
ఏకాంతం ప్రశ్నించింది....నీ కలలన్నీ నిజమైతే నేనేమవాలని
కలలో అనుకున్నా... కలత నిద్రలో నువ్వు...
నాతో ఉంటావ్.....తనకోసం ఆలోచిస్తావ్... నా శత్రువు నువ్వే మనసా
కడదాకా ఉంటా అనుకున్నా.......కడలిలో కలిసిపోతా అనుకోలేదు
కలలతో కనుల యుద్ధం........ కలలే గెలిచాయి
కళ్ళకి సర్జరీ అవసరం....ఎటు చూసిన నువ్వే మరి....
వదలలేక వదలలేక కదిలా.....నీ చివరి చూపు నుండి...
చిరునవ్వు విసిరావు....అందటానికి జీవితకాలం పట్టింది
నాకిష్టమైన కష్టం.....నిన్ను కలవటం ...
నువ్వు కాదన్నందుకు కాదు.....నేను కాదనలేనందుకు బాధ..
దగ్గరగా జాబిలి.....దూరంగా నువ్వు...
జాబిలి ప్రేమంతా నాకేవెన్నెలగా.....మరి నువ్వెక్కడ?.....
నా కన్నుల్లో నువ్వు బందీవైతే...జీవితఖైదు నాకు పడిందేంటి?.......
దగ్గరై తేలికయాను.....దూరమై భారమయావు...
నీతో స్నేహం....నాకిష్టమైన గాయం
ఎన్నాళ్ళకు వస్తానో....నీ నుండి బయటికి....
మనసు బాధ కన్నీరుగా కూడా మారట్లేదు....
కలలన్నీ వెలివేసాయి కన్నుల్ని....... చూసేదెలా నిన్ను?
బాధంతా ఘనీభవించి.... కన్నీరుగా కూడా కరగట్లేదు...
మనసులో జ్ఞాపకాల చినుకులు....కళ్ళల్లో కన్నీటి వరదలా
పురివిప్పిన నా మనసులో... అన్నీ నీ జ్ఞాపకాల కన్నులే....
ఇలా నీ జ్ఞాపకాల సంద్రంలో నేను.....అలలా తాకివెళ్ళే నువ్వు..