ఇప్పుడు నామనస్సు మనస్సులోలేదు
మనసులో ఆలోచనలు లేవు
ఉన్నదల్లా ఒకటే
ఏ నిముషంలో ప్రాణం పోతుందో అనే ఆలోచన
ఇపుడు హృదయాలలో స్పందన లేదు
ఆర్ద్రత అనురాగం లేదు
అనుభూతి, ఆత్మీయత లేదు
ఎదురయ్యేదంతా ఒకటే....
మరణ మ్రుదంగ నాదాల సవ్వడులు...
జనారణ్యంలో మానవ మృగాల సంవేదన..వినిపిస్తుంది
ప్రక్రుతిలో నాకు మనసున్న ప్రాణులే కనిపించడంలేదు
అంతా స్వార్దం.. నిజం తెల్సుకునే ప్రయత్నం చేయరు
పలకరింపు లేదు పరామర్శ లేదు
గాలి,నీరు లేదు
మంచి, మమత లేదు.అనురాగంలేదు
గుర్తుకు వస్తున్నదంతా ఒకటే...
చనిపోయిన తరువాత నాదేహం కుళ్ళు వాసతప్ప