Sunday, July 15, 2012
వెన్నెలరాత్రుల్లు ప్రకృతితల్లి ఒడిలో నేను నిదురోయే వరకే అని..?
ఘల్లు ఘల్లు మంటూ
తెల్లని చీరతో వర్షం
తడి ఆరని పెదాలతో.
తడబడే అడుగులతో
వయ్యారంగా నడచుకొంటూ
ఎదురుగా వచ్చి కూర్చుంది
నా ఊహల సుందరి
కళ్లలోని..కవ్వితల్ని
ప్రేమను పెదాల ఎరుపుగా చూపిస్తూ
బుగ్గళ్ళో ఎరుపును సిగ్గుగా మల్చి
కన్నీటి చుక్కల్ని తుడుస్తూ
ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని
మెల్లిగా చిరునవ్వు నవ్వింది..
నీవు "ఒంటరివని ఎవరన్నారు ?"
నా "కన్నా" బుజ్జీ అంటూఅని ఆప్యాయంగా పిలుస్తూ
దగ్గరకు తీసుకొని నుదుటిపైముద్దాడింది
"మేఘంలా ఆవిరైన నన్ను కౌగలించుకుని
నేను లేనా అని అప్యాయంగా పలుకరిస్తూ
ఆ కౌగిలింతలో వెచ్చదనం నన్నూరడించిది
పొగలు పొగలుగా ఆవిర్లు కదులుతూ
నన్ను గుండెని గట్టిగా హత్తుకోని
గాలి అధికారంపై అదికారాన్ని చలాయిస్తూ
తన కౌగిలి ప్రపంచంలో కరిగించింది
కాని ఇది కల ఇప్పుడు ప్రేమ కబుర్లకి ..
సందేశం మోసుకెల్లడం వరకే..
తరువాత అమె దక్కాక విజయం నాదేనా
వర్షించే వరకు పూజలు పునస్కారాలు..
మమ్మల్ని ఏకాంతంగా కలిపిన ప్రకృతికి వదనం
ప్రకృతి పలుకులు చిలక పలుకులై ..
అంతా నిజంలాంటి బ్రమ అని తేలితే..?
నిజం అయ్యేదెప్పుడని మళ్ళీ ఎదురు చూపులు చూడడం తప్ప
కొద్ది సేపటి ఆనందం నిజం కావాలని
కొండల గుసగుసలలో కరిగి పోతూ
నేల నేలంతా పరుచుకుని వేడి నింపుకుంటూ
పచ్చిక పైరులతో అమెతో వెన్నెల రాత్రుల్లు
రాత్రుల్లు ప్రకృతితల్లి ఒడిలో నేను నిదురోయే వరకే అని..?
నా కళ్ళలో నీళ్ళుఓదార్పు పూలై
నా పైన కురిపించి నన్ను హత్తుకుని
పిలవగానే నేను నీతో ఉంటానని
తన ప్రేమతో తడిపి ఒంటరితనాన్ని
పంచుకుని నేస్తమయింది..నా ప్రియ నేస్తం
Labels:
కవితలు