ప్రియా నాకెందుకో గుబులుగా ఉంది
నా అనుకున్న ప్రతిది ఎదురు తిరిగితే
మన అనుకున్న వాళ్ళు మనసుకు దూరం అయితే..
అన్నీ తెల్సి..ఓదార్చాల్సిన నీవే ఇలా చేస్తే ప్రియా
అందుకేనేమో ఆలోచనలతో నేను
రాలుతున్న జ్ఞాపకాల్ని..
ఏరుకుంటూ వెర్రి వాడిలా..
ఏదో ఆలోచిస్తూ దేనికోసమో చింతిస్తూ,
ఎరుగని ఒక కొత్త లోకానికి నేనేగుతున్నట్టు,
అప్పటి వరకు నాకు పేగుతో ఉన్న భంధం విడిపోతున్నట్టు,
ఉన్న కొన్ని రోమాలు నిక్కబొడుచుకుంటూ,
కొన్ని అరుపులు ఆక్రోశంగా వేదనననుభవిస్తున్నట్టు,
ప్రియా ఏంటో పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఆలోచనలన్నీ