Wednesday, July 25, 2012
ఓ కాలమా.... ఎందుకే నీవు...నన్నిలా చేశావు
ఓ కాలమా.... ఎందుకే నీవు...నన్నిలా చేశావు
ఇంత అల్పసంతోషి ఐనవు ....
నీ "రోజుల" చక్రానికి ఆయువు...
ఇరుబదినాలుగు గంటలు చాలనుకున్నావు ...
ధ్యానములోని తాపసిలా...
ఎంత ప్రశాంతంగా ఉన్నావు...
కాని అది ఏమిటో మాకేమో....
ఇంకో ఇరుబదినాలుగు దినములు
కలిపినా మా "రోజు"కు ఆయువు సరిపోదు...
బ్రతుకుభాద్యతపై మమకారం తీరదు...
పెంచిన ఈ వ్యవధిని కూడా...
బంధాల బంధనంలో బంధీ అవటానికి ...
ఆ ఊచలను ఇంకొంచెం పదిలం చేస్తాం
కాలం అంతంలో "అయ్యో నాకోసం
ఏమి చేసుకోలేదని" రోదిస్తాం...
కాని కాలమా నీకెంత అదృష్టమే???...
గడచినా దానికి దుఖించక...
జరగబోయే దానికి చింతించక...
ఎవరి కోసం వేచి చూడక...
నిర్లిప్తంగా ముందుకు సాగుతూ...
ఈ క్షణం మాత్రమె నిజం అంటావు...
ఏ బంధాలకి బంధీ కానంటావు...
వెనుకకి తిరిగి చూడటం తెలియని...
నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది...
ఒకరి చింత నీకు లేదు...
ఎవరి నుంచి భయము లేదు....
ఎవరికీ ఏమి దాచావు...
ఎవరి నుండి ఏమి ఆసించవు...
ఓ కాలమా నీ పనే బాగుంది సుమా...
Labels:
కవితలు