Monday, July 16, 2012
ఈ చల్లదనం లో నీకు నులి వెచ్చని దుప్పటిగా నిలచి పోవాలని ఉంది ప్రియా
చీకటి తొలగక ముందే..కమ్ముకున్న మబ్బునీడల్లో
తలుపు తీయగానీ జివ్వుమంటూ కురిసిన చిరు జల్లు
నా మనసులోని నీ తలపులను ఒక్కసారిగా తట్టిలేపాయి
ఎవరో షామియానా వేసినట్టు చెట్లపై..
స్వచ్చమైన చినుకులు..
స్వచ్చమైన నీ చిరునవ్వులా
ఈ చిరుజల్లుల.పచ్చని పరువాల చెట్లపై
బొట్లు బొట్లుగా జారుతూ
చల్లటి ఉచ్చులతో నరాలు బిగిస్తో౦ది
చలిని చెక్కుతున్న అకాశ౦ ను౦చి
చిరుజల్లులు నీ నవ్వులా కురుస్తూనే ఉన్నాయి
చుక్కలు కనిపి౦చడ౦ లేదు
చ౦దమామ జాడ తెలియడ౦ లేదు.
అవకాశం ఎప్పుడొస్తుందా బైటికొద్దామని తొంగి చూస్తున్న సూర్యుడు
చి౦తతోపు చివరల్లో౦చి..కమ్ముకున్న నల్లటి మబ్బుతునకలు
చలిగాలిలా దూసుకొచ్చే ఆసవ్వడికి జివ్వుమటున్న మనస్సు..
నీ జాడకోసం ఆత్రంగా అడుగుతోన్న మనస్సు..?
పూలమొక్కల సిగలో ముత్యాలు మెరుస్తున్నాయి
మ౦చులో తడిసిన గుమ్మడి పువ్వు
చిన్నసైజు అక్వేరియ౦లా జలజలలు పోతో౦ది
అరటిబోదెలు నీటి చుక్కలుగా జారుతూ
పొద్దు పొడవట్లేదు
గడ్డకట్టిన శరీరాలపై సూదులు గుచ్చడానికి
సూర్యుడు భయపడుతున్నాడు
ఆలోచనలు రేపిన మ౦టలతో..
వేడి వేడి కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నా..
చిరుజల్లులు చేసే సవ్వడి ...
నీవేం చేస్తుంటావో అంటూ అడుగుతున్నాయి ప్రియా
ఇక ఇక లాబం లేదు నేనే అగ్నిగోళాన్నై ఉదయి౦చి..
నీ దేహానికి వెచ్చని కవిత్వాన్ని..
కాపడ౦ పెట్టాలనే చిరుప్రయత్నమే ప్రియా ఇది.
ఈ చల్లదనం లో నీకు నులి వెచ్చని దుప్పటిగా నిలచి పోవాలని ఉంది ప్రియా
Labels:
కవితలు