నాకు భయంగా వుంది నేను మనిషిగా పుట్టినందుకు .........
నాకు ఆలోచించ గలిగే శక్తీ వున్నందుకు ..........
నాకు భయంగా వుంది
నేను బ్రతకాలంటే పోరాడాలనే నిజం తెలిసినందుకు .........
నేను ఎవరి అంచనాలనో అందుకోవలసినందుకు ...........
నేను బ్రతకడానికి అర్హుడనే అని చాటి చెప్పాల్సినందుకు.........
నాకు భయంగా వుంది....
నేను జంతువులు జీవించే విధానాన్ని ప్రేమిస్తున్నాను ..........
నేను దాక్కోవడానికి ఏదైనా చోటు చూపించండి .........
నేను బ్రతకడానికి ఏదైనా అడివి పేరు చెప్పండి .....