నీ స్వాస నాది కావాలని ఆశపడ్డాను..
తర్వాత అది అత్యాస అని తేల్చావు..
నీతో ఏడడుగులు నడవాలంటే..నీవెవరని అడిగావు
నీవు లేనిది నాజీవితం లేదంటే ..అవునా అన్నావు..?
నీ శ్వాసే నాది అంటే ఛా అన్నావు..ఈ నిజాల్ని ఎప్పుడు నమ్ముతావు
నా హృదయస్పందన నీదన్నా ...అయినా నీనుంచి సమాదానం లేదు
చివరికి నాకు తెల్సింది ..నీకు హృదయం లేదని
ప్రేమనే ఆశచూపి అఘాదం లోకి నెట్టావు..చూసి నవ్వుతున్నావు
చివరి క్షనాలు అని తెల్సినా..నీ లో ఎలాంటీ మార్పులేదు రాదు మరి నేను..?