సెలవంటూ పలకనా చెలి సేదతీరు సమయాన
కలనంటూ చేరి పలకరించనా నిదురించినా
నీలి గగనం నీ నివాసమైనా గాలి గంధం పూస్తా
దాచుకున్నా దాగదు నీ
దాపునున్న హృదయం
చేరుకోక ఈ ప్రణయం
ఊహకందని ఊసునై నీ ఊపిరిలో అల్లుకుపోతా
నీ వలపు వెన్నెలలో తెలియని మెరుపునై మురిపిస్తా
నా జతకై వెతికేలా నీ కనుపాపలతో జాగారం చేయిస్తా
నిను నిత్యం కాచే ఆ కనురేప్పనే నేననే నిజం తెలియజేస్తా..