ప్రియా నా కన్నీటికి ఎందుకు పక్షపాతం!!
తనువు గాయాలకు
వెల్లువై నేనున్నానంటూ
గుండెలపై వర్షం లా
చెక్కిల్ల మెరుపులా
వరదల జల జల
ఉబికి వచ్చే కన్నీరు
ప్రియా మనుసు బాధపడితే
తడి ఆరి బండబారి
గొంతులొంచి గుండె లోకి
అవిరై నీరు మింగి
గుండె మంట పెంచి పెంచి
తనలోనే దస్తుంది ఎందుకనో!!!
ప్రియా మనసు సేద తీరితే చూడలేని అసూయా?
నాదైన శరీరానికి నా మనసుపై పక్షపాతామా?
కన్నీటికి కూడా ఇంత కాఠిన్యమా ప్రియా ?