అయినా ..కలత చెందిన హృదయం
ఒకచోట ఉండనే ఉండదు ..ప్రియా
ఒక పచ్చని పూలచెట్టు నీవు దూరం అయి మోడుగా మారుతోంది
పలచని నవ్వుతోనో.. లేత కిరణం లానో ..
నిన్ను దాచుకోవాలనే విఫల ప్రయత్నం ప్రియా
ఒక ఓదార్పు మెట్టు ..ముగిసిపోయిన ప్రాణాలపై రాలే..ఒక కన్నీటి బొట్టు
ఒక సముద్రం.. ఎగసిపడే కెరటాలు ..
ఇవన్నీ నా జీవితాన్ని గుర్తు చేస్తున్నాయి ప్రియా
నా భవిష్యత్ ను చూపిస్తున్నాయి...ప్రాణంలేని నా ఆత్మని
పరుగులు పెట్టమంటే ఎలా ప్రియా..
ఓడీన హృదయం..జారిన మనస్సు..
పరాగ్గా నన్ను నేను ప్రశ్నిస్తున్నాయి ప్రియా...
ఎవ్వరు నీవని అయినా ఎవ్వరిని నేను