Tuesday, June 14, 2011
నా హృదయం విషాద గీతాలతో విలపిస్తున్నది.
మబ్బుని వీడిన జల్లువై నా మధి స్రవంతి పవిత్రతను పెంచావు,
మరి ఈ ఆత్మీయుడిని ఎండగట్టి ఏ సాగరఘోషకి చేరువయ్యావో చెలి
అమావాస్య చీకట్లను వీడిన నెలవంకలా పౌర్ణమి వెలుగులను పంచావు,
కానీ అంతలోనే వేకువేరుగని కాలరాత్రులను కన్నులారా స్వాగతించేల చేశావు.
కిరణంతో మమేకమైన వెలుగుధారలా నవ్య ప్రభాతాన్ని నీ చెంతలో చూపించావు,
ఏ నియంత్రణలో ఈ మనసుకి అలుపెరుగని అరణ్య రోధనని మిగిల్చావో.
అరవిరిసిన కుసుమం వలె నాలో పరిమలత్వాని పెంచుతావనుకున్నాను
ఈ జన్మలో నా నవ్వుల పువ్వులు మొగ్గలోనే వాడిపోయేలా చేశావు.
రాగాల లోగిలి కానుకగా ఇచ్చిన సప్తస్వరాలతో మన మధుర స్మృతులను సరాగనివై వినిపించావు,
ఏ హంగులతో నన్ను వీడిపోయావో కానీ ఎన్నడు కఠినత్వాన్ని ఎరుగని
నా హృదయం విషాద గీతాలతో విలపిస్తున్నది.
నీ మౌనపు ఓదార్పు కోసం ఎదురుచూస్తూ పరితపిస్తున్నది ప్రియా..
- Vijayii
Labels:
కవితలు