Friday, June 3, 2011
చల్లని రాత్రి....వర్షంపడి వాతావరనం చల్లగా ఉంది
చల్లని రాత్రి....వర్షంపడి వాతావరనం చల్లగా ఉంది
అందరూ వాతావరనాన్ని అస్వాదిస్తున్నారు నేను తప్ప..
బయట ఎంత చల్లగా ఉన్నా ..గుండేలో ఆవిర్లు
అంతటి చల్లదనం లో కూడా వెచ్చటి ఆవిర్లు వస్తున్నాయి
ఆలోచనల తో నిజంగా చెపట్లు పడుతున్నాయి తెల్సా..
ప్రతిక్షనం నీ ఆలోచనలతో పిచ్చెక్కుతోంది తెల్సా..
ఏం జరుగుతోందో ..ఏంజరగ బోతోందో అర్దం కావడం లేదు..
తప్పని పరిస్థితుల్లో నేనో నిర్నయం తీసుకున్నాను..
అంతకు మించి నేనేం చేయలేక..నిన్ను మరీ భాద పెట్టలేక ..
నీవు ఎక్కడ వున్నా సంతోషంగా ఉండాలనే చిన్ని కోరిక తప్ప..
నేను కోరేది ఏమీ లేదు...అదే నా చివరి కోరిక..
చావు పుట్టుకలమధ్య స౦దేహ౦ లా౦టి
జీవిత౦లో నలువైపులా అ౦ధకార౦
మ౦చి గ౦ధ౦లాగ పరిమళి౦చే మానవత్వ౦
మాకున్న ఒకే ఒక అల౦కార౦
...మజిలీ మజిలీకి అలసిపోతున్నా౦
మలుపు మలుపుకీ రాలిపొతున్నా౦
ఆశల వెచ్చని పాన్పుమీద స్వప్నాల పుష్పాలు జల్లుకుని
ఆదమరచి కాసేపు విశ్రమి౦చడానికనుమతి౦చు త౦డ్రీ..!
( ---దేవరకొ౦డ బాలగ౦గాధర్ తిలక్ )
ప్రియమైన నేస్తాల్లారా...
ఇ౦తకాల౦ మీరు చూపిన అభిమానానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకు౦టున్నాను.
ఇక మీ ను౦డి శాశ్వత౦గా సెలవు కోరుకు౦టూ...
Labels:
కవితలు