కల ఒక జ్ఞాపకం
గుర్తుకొచ్చి రాక తికమక పెడుతుంది
జ్ఞాపకం ఒక కల
నిజమో భ్రమో తెలియని అయోమయంలోకి నెడుతుంది
కలలాంటి జ్ఞాపకం
జ్ఞాపకం లాంటి కల
నువ్వే....
నీ ప్రేమలో నన్ను నేను వెతుక్కోవాలనుకుంటాను
నువ్వే కనిపించకుండా పోతావు
నీ సాన్నిహిత్యంలో సేద తీరాలనుకుంటాను
ఎండమావివై వెక్కిరిస్తావు
నీ ప్రేమరాహిత్యంలో ఘనీభవించిన హృదయాన్ని
నీ వెచ్చటి కన్నీటి జల్లుతో కరిగిస్తావు
కరిగి కన్నీరయిన నన్ను
మండుటేండగా మారి మరిగిస్తావు
హృదయం చాలని అనుభూతివనుకుంటే
జన్మకు చాలని ఆవేదన మిగిలిస్తావు