ఆ నలుగురు..నిజాన్ని ...నిజం లాగా చూపించిన సినిమా..వచ్చేప్పుడు ఒక్కడివే వస్తావు..పోయేప్పుడు ఒక్కడిగానే పోతావు..నడిమద్యిన ఈ బందాలు అనుబందాలు ఏంటి అనే సాంగ్ చాలా బాగుంటుది..పుట్టిన తరువాత జరిగే సంఘటనలన్నీ నాటకమే ఏదీ నిజంకాదు...అందరూ నటులం నటిస్తున్నాం....ఏవ్వరికి ఎవ్వరూ శాశ్వితంకాదు..జీవితం లో నాది అనేది ఏది ఉండదు...నాది అనుకోవడం ...మన అనుకోవడం...వారుదూరం అయ్యాక భాద పడటం...అంతా విధి లీల...ఎందుకు కలుస్తారో ....ఎందుకు దూరం అవుతారో తెలీదు..కనీసం మనసులేకుండా వారలా ఎందుకుకలా ప్రవర్తిస్తారో తెలీదు ..నిజంగా ఒకరంటే ఒకరు ప్రాణంగా ఎలా ఉంటారు....అదంతా నిజం కాదు కదా...మనం అన్నీ నిజాలు అనుకోవడం బ్రమ ...బ్రమ లో బ్రతుకుతూ అన్నీ నిజాలు అనుకుంటాం కాని బ్రమ అని తేలుతుంది....అప్పుడు తెలుస్తుది మనుషులంటే ...బ్రమల్లో బ్రతికిస్తున్న బందాలు నిజంగా చాలా భాదపెడతాయి...అవతల వారు భాద పడతారని తెల్సి కూడా హేపీగా ఉండే వాళ్ళను చూస్తే....? మనిషులకు మనసులు లేకుండా ఎందుకు పోతున్నాయో అర్దంకావడంలేదు..అంత ఖటినంగా ...ఎలా ఉంటున్నారు ఉంటారో ఆలోచిస్తుంటే ఏమి అర్దంకాదు ....అంతా బ్లాక్ గా కనిపిస్తుంది...ఎందుకు అంటే అంతే...బాలు గొంతులోంచి వచ్చిన పాట అద్బుతం...కంట కన్నీరు తెప్పించే నిఖార్సైన నిజం ఈ పాట..ఆ నలుగురి సినిమాలో పాట చాలా అద్బుతంగా ఉంటుంది మీనింగ్ ..ఎంత సంపాదించావనేది కాదు...ఎంత మందిని సంపాదించుకున్నాం బ్రతికి ఉన్నంత కాలం ఎంతమందికి సహాయపడ్డాం అనేదే శాశ్వితం..అదే మనం చనిపోయిన మళ్ళీ మనిషిగా బ్రతికిస్తుంది...ఆకీర్తి కలకాలం ఉంటు
ఒక్కడైరావడం ఒక్కడైపోవడం నడుమ ఈ నాటకం విధిలీల....
వెంట ఏబందమూ ..రక్తసంబందమూ తోడుగా రాదుగా తుదివేళ...
మరణమనేది ఖాయమని మిగిలిన కీర్తిఖాయమని నీ బరువు నీపరువు మోసేది ఆ నలుగురూ..
నలుగురూ మెచ్చినా ..నలుగురూ తిట్టినా విలువలే శిలువగా నిలిచావూ
అందరూ సుఖపడే సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు..
నలుగురు నేడు పదిగురుగా పదిగురువేలు వందలు గా నీవెనక అనుచరులై నడిచారు..ఆ నలుగురూ..
వెళ్ళిరా నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మాగుండెలో నిలిచావు..
ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలచురా చిరకాలం
బ్రతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం చాటేదీ ఆ నలుగురూ..ఆనలుగురూ
ఆ పాట తాలూకూ వీడియో చూడండి జీవితం అంటే ఇదే మరి