Tuesday, June 14, 2011
కానీ నీవు నాకు చితిమంటలను నాకు పేర్చావు
నా ఆశలన్నీ నీరుగారిపోతున్నపుడు ,
ఆదరిస్తే అక్కున చేర్చుకుంటావనుకున్నా..
కాని,నన్ను అధఃపాతాళానికి అణచివేశావు ...!
నా నీడకు జోడుగా మెలగుతుంటే,
జీవితాంతం నా తోడుగా నిలుస్తావనుకున్నా..
కానీ, నడిమధ్యలోనే వీడ్కోలు పలికావు...!
నా ఒంటరి ప్రాణానికి నీ చేయినందిస్తే,
చేయూతతో చిరకాలం చెంత ఉంటావనుకున్నా..
కానీ, ఆ చిగురాశను నీ చిన్నచూపుతో చెరిపేశావు...!
నేను మౌనం నింగిన విహరిస్తున్నపుడు,
మాటల గాలిపటాలు ఎగురవేస్తావనుకున్నా..
కానీ,ఆ నింగికి మేఘాలను ఉసిగొల్పావు ...!
నీ పంచామృత పలుకులతో పలకరిస్తే,
ఎల్లప్పుడూ ఆనందసాగరంలో ఓలలాడిస్తావనుకున్నా..
కానీ,కన్నీటి సంద్రంలో నన్ను ముంచేశావు ...!
నీ మోముపై చిరునవ్వును చిందిస్తుంటే,
చిరుదివ్వెల చెలిమిని చిగురింపజేస్తావనుకున్నా..
కానీ నీవు నాకు చితిమంటలను నాకు పేర్చావు
అవి చితిమంటలు అయినా నాకు ఆనందమే పేర్చింది నీవు కాబట్టి..
Labels:
కవితలు