. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, June 30, 2011

నిదుర నాకు దూరమై, వేదన చేరువై




నిశి రాత్రి నీ జ్ఞాపకాలు నన్ను కలవపరుస్తుంటే,

నిదుర నాకు దూరమై, వేదన చేరువై,

నా మది నీ తలపులతో పరితపిస్తుంటే,

నా ఉహల్లో నీ ప్రతిబింబం నన్ను మైమరచగా,

నీ సాన్నిత్యపు తన్మయత్వంలో ఓ మధుర స్వప్నపు నీడలో నేను సేద తీరుతుంటే,

కాలం కరిగిపోయింది,

రాతిరి వెళ్ళిపోయింది,

స్వప్నం చెదిరి పోయింది,

మళ్ళీ వేదనే నాకు మిగిలింది..

ఫేస్ బుక్ ఆన్ లైన్ లలో పరిచయాలు పెంచుకొని మోసం చేస్తున్న కీలాడీ లేడి అరెష్టు




దీపికా రెడ్డి అనే మహిళ ఇంటర్నెట్ లో మోసాలు చేస్తు ఇప్పటికే 5 పెళ్ళిళ్ళు చేస్తుకుంది..ఎలా మోసాలు చేస్తుందో మీరూ తెల్సుకొని ఇప్పటికైనా జాగ్రత్త పడండి..అబ్బాయిలేకాదు అమ్మాయిలూ మోసాలు చేస్తునారు ఇలా..

The complainant who is an NRI residing in USA native of Hyderabad, lodged a complaint with Cyber Crime PS on 20.06.2011 regarding impersonation & cheating of an unknown lady on the pretext of marriage using internet media such as Bharat Matrimony & Facebook which was registered as Cr.No.38/2011 U/s.66-D IT (Amendment) Act 2008, Sec.419, 420 IPC and investigated by M.Srinivasa Rao, Inspector, Cyber Crime PS, CID, Hyderabad.
The complainant is resident Hyderabad is presently working in USA as a Software Engineer. During April 2011, he came into contact with one Dr.Deepika Reddy Karri through Bharat Matrimonial Website. As per the profile in matrimonial website, Ms.Deepika Reddy mentioned that she is Doctor and completed MBBS from Osmania University. Subsequently Deepika Reddy befriended with the complainant over internet and decided to marry soon after the complainant arrives from USA. Then onwards, the accused lady Ms.Deepika Reddy started squeezing money from the complainant on the pretexts of donating money to a kid’s brain surgery, setting up a distance education centers and several other stories told by her time to time. Believing the version of the accused lady, the complainant sent money to her through various means like Western Union Money Transfer, wire transfer and depositing money by his friends and parents into her bank accounts situated at Guntur. Like this the accused lady cheated the complainant and squeezed an amount of Rs.14.32 lacs.
During the course of investigation, after examination of witnesses, after analyzing the case technically basing on the mobile numbers, bank accounts, IP Address, Tower Locations and Internet communication, the accused lady Ms.Deepthi Vallapuri @ Deepika Reddy Karri @ Surya Deepthi was successfully identified and arrested her on 29-06-2011 at 13.00 hours. On interrogation she confessed that she has used her mobiles, laptop & internet data card for committing this offence and spent all the money that was squeezed from the complainant for her lavish style of living, renovating her house, clearing hospital bills, visiting various tourist places, purchasing costly garments, mobiles, laptops and other electronic goods etc. As such the Laptops, mobile phones, an internet data card and other material objects were seized at the instance of the accused and she is being remanded to judicial custody. While in the interrogation, she also confessed that she used to cheat people using Internet from the age of 15 years.
Cautions to public:

• Do not believe whatever is found in the internet, social networking sites, matrimonial websites and emails without physically being verified.


ADDL.DIRECTOR GENERAL OF POLICE,
CID, AP, HYDERABAD.

క్షణ క్షణం నీకు దగ్గరవుతున్నానుకొని..ఇంత దూరం అయ్యానెందుకో




మనసు ఇంకా తడిగానే ఉంది..పొడి బారలేదింకా
కాని ఆచెమ్మ కళ్ళను చేరడం లేదెందుకో మరి

నీ చెంత చేరాలని..ఏవేవో చెప్పాలని
హృదయ బారాన్ని దింపుకోవాలని ఉంది

కాని నీ సన్నిది చేరాలంటే..ఏం చేయాలంటూ
నాలోని చేతకాని తనం వెక్కిరిస్తుంది ఎన్నాళ్ళకెన్నాళ్ళ కని

ఎక్కడ నే తడబడ్డానో తెలియక...ఏం చేస్తున్నానో అర్దంకాక
తెలిసినట్లే అనిపించినా దిద్దుబాటులో అడుగులు జారిపోతున్నాయెందుకో?

క్షణ క్షణం నీకు దగ్గరవుతున్నానుకొని..ఇంత దూరం అయ్యానెందుకో
నాకు తెలియకుండానే నీనుండి దూరంగా వెళ్లిపోతున్నాను కదూ ?

అసలేం జరుగుతోంది...ఎవరు తప్పు చేస్తున్నారు కారణం
దాచడానికేమి లేని నేను అయినా మనమధ్య తెలియని అగాధం

తెలిసిన ఒక శూన్యం మనసంతా..తెలియని అవేదన జీవితంలో
తెలియనిదల్లా అధిగమించాలన్న కోరికనెలా ఆచరించాలన్నదే?

నన్ను కాదనవని తెలుసు...ఎందుకు దూరంగా ఉంటున్నావో అర్దంకాదు
క్షమించే నీ మనసు తెలుసు అయినా తెలియని భయం ఆందోళన

చూసావా! నేను చెప్పాలనుకొన్న..ఏం చెబుతున్నానో
విషయాన్ని కూడా నీకర్దమయ్యెలా చెప్పలేకపోతున్నాను కదూ?

ఇకపై ప్రతి క్షణం ఒకే మంత్రం,...నీగురించే ఆలోచనల్
నీవైపు చూస్తూ, నీ మాటలే మదిలో మననం చేస్తూ

నీతోనే నేనని నీలోనే సాగాలని..ఓ తీరని కోరిక
అమ్మలాంటి నీ ఒడిని మళ్ళీ చేరాలని ఓ పిచ్చి ఆలోచన

అందుకోసం నన్ను నేను..పూర్తిగా మర్చిపోయాను
సంసిద్ధ పరచుకోవాలని ఆశతో చేస్తున్నా మరోపోరాటం

సాద్యింకాదని ఈమద్యే తెలిసింది...కాని ఎందుకిలా అని అడుగలేను
ఇప్పటికీ ఓ నిర్నయం తీసుకున్నా ..అటువైపు వడివడిగా అడుగులు వేస్తున్నా

ఎప్పటికైనా నిజం తెల్సుకుంటావు..నన్ను చేరాలనుకుంటావు
అప్పటికి సమయం మించి పోతుంది..కాలం కరిగి పోతుంది
నన్ను తనలో అక్యించేసుకొని నీకు చేరనంత దూరం తీసుకెలుతుంది

నువ్వు నా జ్ఞాపకాలనుంచి, నా నుంచి తప్పుకోవాలని అనుకున్నా





నువ్వు నా జ్ఞాపకాలనుంచి, నా నుంచి తప్పుకోవాలని అనుకున్నా
నీకు తెలిసిన మనసును అడిగి చూడు నీడలా నీ వెంటే వున్నది ఎవరని?
అలిగి అలసిన మాటలనడుగు నీ ఊహల వెనుక ఉన్న ఆశేమిటో
నిజానికి అబద్ధానికి మధ్య నా కలలనీ ఊహలనీ తొక్కిపెట్టిందెవరో
ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ మనసునడుగు నిజం చెబుతుంది

మన ఇద్దరి మధ్య అలుముకున్న చీకటి తెరలని రచించిందెవరో
కనిపించని నిజాలనడుగు అబద్దపు నీడల పొడుగేమిటో
కాలచక్రం ఇరుసులనడుగు కదలిపోయిన కలల కన్నీరు ఏమిటో
నిద్ర రాని నా కన్నులనడుగు నీకు నేనేమిటో

అలా అలవోకగా ఓటమి నన్ను ఓడిస్తూంటే
నిజాల వెంట నీవు ఊహల మధ్య నేను ............
ఎప్పటికీ ఒంటరిగా అదే దిక్కుతోచని సమూహంలో
అయినా! నేనింతకు ముందూ ఒంటరినే ఇక పైనా కూడా .......

ప్రతిక్షనం గుర్తుకొస్తున్నాను అన్న నీవే..నేను అనే వాన్ని అసలెరుగను అన్నట్టుంటే




మాట్లాడటమే సరిగా రాని నేను
ప్రతి క్షణం నీతో
మాట్లాడటానికే వేచి చూసేవాడిని


ఎవరిని పట్టించుకోని నా కళ్ళు
నీ దర్శనం కోసం ఎప్పుడూ
ప్రతిక్షణం వెతుకుతుండేవి

నువ్వు లేనప్పుడు నాది ఒంటరి ప్రపంచం
నువ్వు వచ్చాక నేను..మరిచాను అ ప్రపంచం


నీవు పరిచయం కానప్పుడు నేనెవ్వరో అన్న ఫీలింగ్
నువ్వు వచ్చాక నాలో ఎక్కడో చెప్పలేని దైర్యిం

ఇంతకు ముందు నాకోసం నేను
నువ్వు వచ్చాక నీకోసం
చావునైనా ఎదిరించే తెగింపు


ఎమిటో మరి ఏమాయ చేసావో
నువ్వు ఇలా వచ్చి..అలా వెళ్ళిపోయావు
ఎందుకిలా జరుగుతోంది అని అడుగలేను..

నీవు మారావు ..నన్ను ఏమార్చావు.
నీవున్నప్పుడు ప్రపంచంలోని సంతోషం అంతా నాదే.
ఇప్పుడు ప్రపంచంలో దుక్కం అంతానాదే ..

ప్రతిక్షనం గుర్తుకొస్తున్నాను అన్న నీవే..
నేను అనే వాన్ని అసలెరుగను అన్నట్టుంటే ..
నా మనసుకు సమాదానం ఏమని చెప్పుకోను..
ఎందాకని ఊరడించను...చెప్పు ప్రియా

ఇలా ప్రతిక్షనం నీకోసం ఆలోచించే గుండె ఎప్పుడో ఆగిపోతుంది..
అయినా నీమనస్సు కరుగదు అలా తయారయ్యావు ఎందుకో..?

Wednesday, June 29, 2011

నీతో ఉన్నప్పటి నీ నవ్వులని, నీ మాటల్ని, నీ చేతల్ని, గుర్తు చేస్తూ..




నువ్వు రాబోతున్నప్పుడు నేనెదురు చూసిన ప్రతి నిమిషం గంటగా మారి నన్నెంతగా బాధించిందో
ఇప్పుడు నువ్వెళ్ళబోయే సమయం మేఘాలపై పరుగున వస్తూ అంతే బాధిస్తోంది ..
నీతో గంభీరంగా ఉండాలనుకుంటానా !!? నిన్ను చేరేవరకే అది....
నాలుగు రోజులుగా కొమ్మ చివరన నిబ్బరంగా ఉన్న గులాబీని ప్రేమతో సున్నితంగా తాకీ తాకగానే జల జలమంటూ రాలే రేకుల్లా ...
నిన్ను చూస్తే చాలు ఉరకలు వేసే హృదయాన్ని మభ్యపెట్టడానికి ఆ దిక్కో ఈ దిక్కో చూపిస్తున్నా...
నువ్వున్నప్పుడు ఎన్ని చెప్పాలనుకుని చెప్పలేకపోయానో నువ్వెళ్ళిపోతున్నావంటే మరెన్నో చెప్పాలనున్నా... మౌనంగా చూస్తున్నా,,,
నువ్వు మాత్రం నన్నే చూస్తూ .. ఈ కొద్ది క్షణాలైనా కళ్ళనిండా చూసుకోవాలన్నట్టు ...
నిజమే కదా! కొన్ని రోజులైతే నువ్వు నా పక్కనుండవు...
కానీ.. ఎలా..? నిన్ను ఇలా చూస్తానా... అలా ..... మనసు భారంగా మారిపోతోంది ..
తన గుండె చప్పుడు వినిపించాలని విశ్వప్రయత్నం చేస్తుంది.
నువ్వెళ్ళిపోయిన క్షణం .. అప్పటి వరకు నువ్విక్కడే.. నా పక్కనే ... కానీ ఆ పైన నేనొక్కడినే....
ప్రేమలో నీకు నా వీడ్కోలు నా మనసుకి అనారోగ్యం...తట్టుకోవడానికి తగ్గడానికి కాలమే ఔషధం.....
నీ జ్ఞాపకాలైనా ... నన్ను ఓదారుస్తాయనుకుంటే.. అవి కూడా నిర్దయగా నే మోయలేని బరువై మదిలో చేరి ..
నీతో ఉన్నప్పటి నీ నవ్వులని, నీ మాటల్ని, నీతో చేతల్ని, గుర్తు చేస్తూ..
నువ్వు లేనితనాన్ని గుచ్చి గుచ్చి చూపిస్తున్నాయి..
తీపి జ్ఞాపకాలని.... ఒంటరితనంతో పోలుస్తూ.... వాటిని చేదుగా మార్చే వీడ్కోలు భారాన్ని నే తట్టుకోగలనా!!!!!!?

నీవు నన్నెప్పుడు అర్దం చేసుకుంటావు...ఎన్ని జీవితకాలాలు కావలి




నీవు నన్నెప్పుడు అర్దం చేసుకుంటావు...ఎన్ని జీవితకాలాలు కావలి
ఒకప్పుడు నన్ను చాలా అర్దం చేసుకున్నావు..మరిప్పుడు...
ఏది జరుగకూడదనుకుంటానో అదే జరుగుతుంది..
ఏది వినకూడదు అనుకుంటానో అదే వినాల్సి వస్తుంది.
నీవు నిజంగా చాలా హేపీగా ఉన్నావు ప్రపంచం ఎటుపోతే నాకేందన్నట్టూ...
కొన్ని సమయాల్లో హేపీగా ఉన్న నిన్ను చూస్తుంటే..హ్యుమన్ రిలేషన్ ఇంతే నా అనిపిస్తుంది..
కచ్చితంగా జరుగ బోయే కొన్ని సంఘటనలు నీకు నిజాన్ని తెలుపుతాయి..
జరుగుతున్న వాటిలో ఏది నిజమో తెల్సుకునే ప్రయత్నం చేయి..
కొన్ని నిజాలు నిప్పులై నిన్ను వెంటాడుతాయి నిజం తెల్సుకో...
ఓ మనిషి మనసులో అలజడిని గుర్తించలేవా..ఎందుకలా మారావు..
ఇప్పుడున్న నీవు నీవుకాదు మారావు ఎందుకు మారావు కారణం.
వద్దు ఈ మార్పు నీకు సూట్ కాదు ఎప్పుడూ నీవు నీవు లాగే ఉండు..
చెప్పటానికి నేనెవ్వర్ని అని అడుగకు చచ్చేదాకా నాకా భాద్యిత ఉంది..
ప్రతిక్షనం నిన్ను గమనిస్తూ నీ క్షేమంకోరే మనిషిని నేనే..
నీకేమన్నా జరుగుతుందంటే ప్రాణాలకు ఎదురొడ్డీ నిలచేది నేనే...
నేను నీ నేస్తాన్ని ఒకప్పుడు..ఇప్పుడు కాదు ఇష్ట పడ్డ నేస్తాన్నే కదా..?

మరో క్షణమైనా నిరీక్షించని ఆ ఆఖరి క్షణం నిన్ను మరువనివ్వదు





నీ ఊపిరిని నాఊపిరిగా చేసుకున్న నా ఆలోచన స్వరం నిన్ను మరవనివ్వదు
పెదవి చెర దాటని నీ గుండె లోని భావం నిన్ను మరవనివ్వదు
కనుపాపలు కురవనివ్వని నీ కన్నీటి వర్షం ... నిన్ను మరవనివ్వదు ...
కనిపించే నీ నయనం విడిచిన భాష్యాల బాణం మరపురానివ్వదు
ఆశించని నీ కరమిచ్చిన తొలి చెలిమి వరం నిన్ను మరపురానివ్వదు
మరలా మరలని నీ అడుగుల దురాల పయనం నిన్ను మరువనివ్వదు
మరో క్షణమైనా నిరీక్షించని ఆ ఆఖరి క్షణం నిన్ను మరువనివ్వదు
తరువాత యుగాన్ని తలపించిన నిజాల నిమిషం నిన్ను మరువనివ్వదు...... నిన్ను

"కదిలే కాలం నీ కాళ్ళ కింద నా హృదయాన్ని అణిచివేస్తున్నా ,
మరణించే కాలం మిగిలిఉండే వరకు నా చెలియ నిన్ను మరవనివ్వదు..
తన చెలిమి నిన్ను మరపురానివ్వదు .. "

Monday, June 27, 2011

గుడ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ ....గుడ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్

గుడ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ ...గుడ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్

గుడ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ .....గుడ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్

గుడ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ ,,,,,గుడ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్

గుండెపగిలి చిందుతున్న కన్నీటిని ఆపుకోలేని నా కనుల ముందు ఓడిపోయాను.




మొదటి చూపులోనే కనులలో నిండిన రూపాన్ని మదిలో చేర్చద్దని,
వారిద్దామనుకున్నాను కాని నా ఆలోచనల ముందు ఓడిపోయాను.

గుండెలో రాసుకున్న మాటలన్ని గుట్టుగా దాచుకోకుండా,
నీమనసుకి చేరవేద్దమనుకున్నాను,,,
కాని బయటపడనివ్వని నా పెదవి ముందు ఓడిపోయాను.

క్షణానికి ఒకసారన్నా నిన్ను చూడాలని నీ దరిచేరాలని నా మనసు తహతహలాడినా,
రవికాంతిని నింపుకున్న నీ ముఖతేజస్సు చూసే శక్తి నా గుండెకి లేక నీ అందం ముందు ఓడిపోయాను.

నీ మనసులో నేను లేనని తెలిసి, నా మనసులో దాచుకున్న ప్రేమని సమాది చేద్దమనుకున్నా,
గుండెపగిలి చిందుతున్న కన్నీటిని ఆపుకోలేని నా కనుల ముందు ఓడిపోయాను.

మనసుకి తగిలినా గాయాలన్ని తట్టుకుంటూ, తిరిగి నీ ప్రేమకోసం ప్రయత్నిస్తున్నా,
నా ప్రేమను కన్నీరుగా మార్చిన, నీ మనసు ముందు ఓడిపోయాను.

నా ప్రేమను పంచలేక, నీ ప్రేమను పొందలేక, మనసు నిండా నింపుకున్న ప్రేమని,
తుదిశ్వాసతో వదిలేస్తూ, చివరికి ప్రేమ ముందు కూడా ఓడిపోయాను.

ఓ మనిషికి మనస్సు మద్యి దూరం ఇంత వేదన కలిగిస్తుందా.




నీకై వెదుకులాటలో...
ఎక్కడో నన్ను నేను పారేసుకున్నాను
జీవితాన్ని చేజార్చు కుంటున్నను
ఇప్పుడు అంత శూన్యం
నాకు నేను మిగలకుండా ఎందుకిలా.....?
ఒక్క నీ కోసం చాల పోగుట్టుకున్న
నాకు ఎందుకింత ఆశ....?
నీ కన్నుల వెలుగులతో నా జీవితాన్ని నింపుకోవాలని..
నాకనిపిస్తోంది ఆశ హద్దులు దాటుతోందని నిజమేకదా..

ఓ మనిషికి మనస్సు మద్యి దూరం ఇంత వేదన కలిగిస్తుందా.
నీకు నేనున్నానంటూ చెప్పిన మనిషి ఇప్పుడెక్కడ
కాలగమనంలో నన్నొంటరికి చేసి ఎక్కడికి వెళ్ళీంది..
కన్నీళ్ళతో కలిసుండ మని..
నీజీవితానికి అదే ఎక్కువంటూ వెక్కిరిస్తోంది కదూ
కాలం చేసే కచేరిలో విషాద గీతాలు పాడుకోమని ..
ఒకమనిషు దూరం అయితే ..
మరో మనిషిలో ఇంత భారం ఉంటుందని..
ప్రతిక్షనం ఇంత వేదన పడాల్సి వస్తుందని..?
నీకు తెలుసా ...ఎప్పుడన్నా గుర్తుకు వస్తానా..
నాలుగు జన్మలకు సరిపడా విషాదాన్ని నాకు మిగిల్చి..
నేనెవ్వరూ గుర్తు పెట్టూకోలేనంతగ దూరంగా ఎందుకు ఉంటున్నావు..
క్షమించు నిన్ను అడిగే హక్కు నాకు లేదుకదూ ..నా లెవల్ మర్చిపోయా..
నేను బాగా ఎక్కువగా ఊహించుకున్నానేమో కదా...?
జరిగింది అంతా వాస్తవం అని నమ్మానేమో కదా..?
వెర్రివాన్ని జరుగబోనే అసలు నిజాన్ని గుర్తించలేక పోయా..?

మన మద్య ఉన్న ఈ దూరాలన్ని తొలగించవా....?




నీకు నాకు మద్య ఏమంత దూరం
భావానికి భావుకతకి మద్య స్రుజనాత్మకతేగా
ఆలోచనకి ఆచరణకి మద్యనున్న దూరమేగా
మౌనానికి మాటకి మద్యనున్న దూరం ఎంత
ఆశకి ఆచరనకి మద్యనున్న సంకల్పమేగా
ఆచరణకి అహానికి మద్యనున్న అంతరంమేగ
బతకటానికి బతికేయటానికి మద్యనున్న అగాధమేగా
మన మద్య ఉన్న ఈ దూరాలన్ని తొలగించవా....
నువ్వు నా కోసం రావా
నువ్వు ఎదురైయ్యే క్షనాల కోసం
ఇంకా ఎన్ని యుగాలు వేచి ఉండాలి...
అది నా మరణానికి ముందా తరువాతా...?

Sunday, June 26, 2011

నీ వంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని..

నా ఆటోగ్రాఫ్ సినిమాలొ ఓ మంచి ట్రాజిడి సాంగ్ ఉంది....అప్పటిదాకా కవ్వించి నవ్వించిన ప్రియురాలు దూరంఅయినప్పుడు హీరీ పాడే అద్బుతం మైన సాంగ్ తన స్వార్దంచూచుకోని మరికరి వంచన చేరి....ప్రేమించిన వాడీని మోసం చేసి వంటరివాడీని చేసింది...నీవంటే ప్రాణం అనే సాంగ్.... ఆసాంగ్ లో ప్రేమనుమొత్తం ఎలా వ్యక్తంచేయాలో చెప్పాడు రచయిత.. ప్రియురాలిని నీతోడే లేకుంటే నాకు లోకంతీ పనేంటని మీనింగ్ ...ప్రియుడీని మోసం చేసి మరొకరితో వెళ్ళిన ప్రేయసిని గుర్తుకు తెచ్చుకుంటూ పాటుకునే సాంగ్...ఆ పాటను ఓ సారి పరిసీలిస్తే

నీ వంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని..
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప ....కన్నులకు కలలు లేవు నీరు తప్ప..
మనస్సు ఉంది మమత ఉంది ......పంచుకునే నీవు తప్ప..
ఊపిరి ఉంది ఆయువు వుంది..ఉండాలనే ఆశతప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంటేనా..ప్రేమిస్తేనే సుదీర్గనరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్ప...చివరికి ఎమవ్వాలి మన్ను తప్ప

నీవంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని..
నడిచొస్తానన్నావు ..మళ్ళోస్తానన్నావు..జంటై మరొకరి పంటై వెళ్ళావు
కరునిస్తానన్నావు వరమిస్తానన్నావు...కరువైమెడకు ఊరి అయిపోయావు
దేవతలోను ద్రోహంఉందని తెలిపావు..దీపంకూడా దరియిస్తుందని తేల్చావు
ఎవరిని అడగాలి నన్ను తప్ప..ఎవరిని నిందించాలి నిన్ను తప్ప..

నీవంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని..

ఆ పాటతాలూక వీడియీ చూడండి ఇక్కడ

నన్ను దోషిని చేసి అన్నీ సాదించుకున్నా వాడి మనసు కరుగలేదు





రాలిపడిన ఉల్కలాంటి చిటికెడు ప్రేమతో కొలిచాను
ప్రాణం వీచిన నీ ప్రేమ మహావృక్షం ముందు
చిన్నిమొక్కలా నీ ప్రేమకోసం ఇంకా చుస్తూనే ఉన్నా..


నీవెంత అవమానించినా అవమానించినా మన్నిస్తావనే నమ్మకమెలా వచ్చిందో నాకు!
బహుశా...ఇంకా నీమీద ఉన్న ప్రేమే కారణం అనుకుంటా
నా అహం నీ మెత్తని ప్రేమకు తల బాదుకుని ఇప్పటికి మరణించి వుంటుంది!
ఎంతసేపూ నీ గురించే...ఆలోచనలు పిచ్చెక్కిస్తున్నాయి
బహుశా...ప్రేమను గుర్తించలేకపోతే అప్పటికే ‘నేను’ మరణించి వుంటాను!
ఓ వ్యక్తి
అతని అసమర్థత... అతని స్వార్థం...
నీకేమీ ఇవ్వలేనితనం... చేతకాని దోషం...
అన్నీ కప్పిపుచ్చుకోవటానకే నిన్ను ఏమనలేక..
నన్ను దోషిని చేసి దూషించటాలు... ద్వేషించటాలు...
నన్ను దోషిని చేసి అన్నీ సాదించుకున్నా వాడి మనసు కరుగలేదు
నిన్ను మనస్పూర్తిగా ప్రేమిస్తే..నిన్ను అంతగా నమ్మితే..
నాస్నేహాన్ని ఎందుకు అడ్డుగా పెట్టుకోని ఆడుకొన్నాడు
గుండెలనిండా నీమీద మోహమా ప్రేమా అది..

గుండెనెవరో బయటకు లాగి ముక్కలు చేస్తున్నట్టూ....?




అర్ధరాత్రి ఉన్నట్టుండి జ్ఞాపకాలు రెక్కలు తొడిగి రోడ్డున పడతాయి
అందరి కాళ్ల కింద నలుగుతూ పయనిస్తూనే ఉంటాయి..
ఇలా నిదురలేని రాత్రులు ఇప్పటికీ గడుపుతూనే ఉన్నా

ఉదయం మూడుగంటలు,ఎనిమిది గంటలు
మద్యాన్నం రెండు గంటలు, నీవు నిదుర లేచే నాలుగు గంటల సమయం
సాయంత్రం పదిగంటల సమయం ..ఇవేమీ మర్చిపోలేను ఎప్పటికీ...
ఇలా ప్రతి క్షనం నీజ్ఞాపకాలను ఇప్పటికీ తడుముకుటూనే ఉన్నా

గుండెనెవరో బయటకు లాగి ముక్కలు చేస్తున్నట్టూ
గుండెను ముక్కలు ముక్కలుగా చేస్తున్నట్టూ.

ప్రతి రోజూ అర్ధరాత్రి వరకు అదే వేదన
గుండె కుమిలి కుమిలి కన్నీటి చుక్కగా మారే ముందు కలిగే వేదన
చీకట్లను చీల్చుకొని ఉదయించేందుకు సూర్యుడు పడే వేదన..
ప్రతినిమిషం ప్రతిక్షనం నేను పడుతున్న వేదన నీకు తెల్సు .
అయినా మౌనం వీడవు కారణం ఏంటని అడిగే హక్కులేదు నాకు
ఎందుకో భయమేస్తోంది తెల్లవారుతుంటే ఎం వినాల్సి వస్తుందోనని
...

జన్మంతా నీ చెంతే బతకాలనుకున్నా..కలకాలం నీ వెంటే ఉండాలని ఉన్నా




జన్మంతా నీ చెంతే బతకాలనుకున్నా
దైవేచ్చకు తల వంచి నే మరణిస్తున్నా
కలకాలం నీ వెంటే ఉండాలని ఉన్నా
విదికి ఎదురు తిరగలేక నే కన్నుమూస్తున్నా
నిన్ను కానని నా మనసు ఉరకలు వేస్తుంది
కనిపించే ప్రతి వారిని నీ గురించి ఆరా తీస్తుంది
ఏమైనా ఈ క్షనమే కలవాలంటుంది
నీ నేస్తం ఇక లేడని చెప్పాలంటుంది
ఏమీ చేయలేని నిస్సహాయున్నా రా నేను
అడగకనే నీ ఆశలు తీర్చాలనుకున్నా
చెప్పకనే నా శ్వాసను వదిలేస్తున్నా
నీ కల్లల్లో కన్నీటిని తుడవాలనుకున్నా
నీ ముందుండీ కదలలేక శిలనై పొతున్నా
నన్ను విడిచిన నా ఆత్మ నీకోసం దిక్కులు చూస్తుంది
ఏ దిక్కున నీవున్నా కనీసం ఆఖరి చూపు చూస్తావని..
నీ స్నేహితుల తో సంతోషం బిజీగా ఉన్నావు..
నా మరణ వార్త తెల్సికూడా మౌనంగానే ఉన్నావు..
ఇలా ఉంటా వని నేను కలలో కూడా అనుకోలేదు..
నేనిక బ్రతికి ఉండటం వేష్టని నీవు చెప్పకనే చెప్పినట్టుంది
కాని చివరిసారి నీ నవ్వును చూడాలంటుంది
నవ్వలేని నిన్ను చూసి నాకు ఏడ్వాలని పిస్తుంది
నేనిప్పుడు చచ్చిన శవాన్ని అని మర్చిపోయా..
రాలిపోయి నేలపైన శిలనై పడి ఉన్నా
వీడిపోని నీడనై నడవాలనుకున్నా
కదలలేని కాయమై ,ఓ కలనై పోతున్నా
గతియించిన నా దేహం 
నీ ముందే ఉంది
నేను ఇప్పుడు బ్రతికి లేని ఓ జీవం లేని శవాన్ని
నీ స్పర్శకు నోచుకోక కన్నీరు మున్నీరవుతోంది
ముందుకొచ్చి ముద్దిచ్చి సాగనంపు నేస్తం ప్లీజ్
మనసారా కౌగిలించుకో ఇది నా ఆఖరి కోరిక
అందరాని తీరాలకు నే అడుగులు వేస్తున్నా
అనంతదూరానికి వెలుతున్నా నీవు లేకుండా

ఏంటీ వేళ ఈ ఆందోళన...ఎందుకో తెలీదు




ఏంటీ వేళ ఈ ఆందోళన...ఎందుకో తెలీదు
కారణాలు వెతుకుతుంటే కన్నీళ్ళే వస్తున్నాయి
ఎవరు ఎందుకు దాడిచేస్తున్నారో తెలీని క్షనాన కుడా నీవున్నవన్న దైర్యం..
ఎందుకో తెలీసు నీవు మౌనంగా ఉండి నన్ను మాట పెగలటంలేదు..
మనసు ఈరోజెందుకో మౌనంగా రోదిస్తుంది నీవు గుర్తుకు వచ్చి..
అవును నీవు నిజం..నీ స్నేహం నిజం..నీ ప్రేమ నిజం
నేను మాత్రం అబద్దం, నాస్నేహం అబద్దం , నాప్రేమ అబద్దం..

Saturday, June 25, 2011

చేతకాని వాడిలా చేతలుడిగి ఆకాశంవైపు ఆవేదనగా చూస్తూ..




ఏమని చెప్పను ఎలా చెప్పను..
మాటలకందని ఆవేదన..
మనసును పిండేస్తున్న నిజాలు..
వద్దనుకున్నా కాదనుకున్నా జరిగే ఘటనలు..
నన్ను నేనే వెక్కిరిస్తున్న పరిస్థితులు


దిక్కులు పిక్కటిల్లేలా అరవాలని వుంది..
ఇనుప సంకెల్ల్లను కసిగా తెంచాలని..
ఎవరి మీద నాకసి ..ఎందుకు నాకీ ఆవేశం
విషయంలో ఎవ్వరినీ ఏమనలేకపోతున్నా..ఎందుకు
చేతకాని తనమా..నీ మీద ఇంకా మిగిలి ఉన్న ప్రేమా..
ఏమైనా చేయగలను కానీ ఏమీ చేయలేక పోతున్నా..
నీకు చిన్న భాద కూడా కలగకూడదన్నా స్వార్దం..
నన్ను నేను ఓటిపోయేలా చేస్తుంది..ఎందుకిలా
చేతకాని వాడిలా చేతలుడిగి ఆకాశంవైపు ఆవేదనగా చూస్తూ..


ఈ రక్తమాంసదేహం నుండి విమూక్తి పొందాలని..
ఏదో సాధించాలని.. మదిలొ అలజడి..
ఎవరో చెప్పారు..చెవిలో గుసగుస లాడుతున్నారు
నీవు బ్రతకడం దండగని..ఎవరు చెప్పినా అదే నిజం కదా...?
మదిలొని భావాలని వ్యక్తపరచలేని అసహాయతను మించిన ..
భాద మరొకటి ఉండదు నీవే దూరం అయినప్పటి నుంచి..
ఇప్పటిదాకా పడుతున్న భాద ఎప్పటిదాకా..ప్రియా..
అవును నీవు చెప్పింది నిజమే గొంతులో ప్రాణం ఉండేదాకేగా

నీ ప్రేమ తపస్సులో మాటలు మౌనంగా మిగిలిపోయాయి




ప్రియతమా...
నిన్ను వర్ణించుదామంటే,
పదాలకు అందని భావానివి నువ్వు

నీ ముగ్ధ మనోహర సౌందర్యం...
నీపై నాకు గల ప్రేమతో పోటీ పడుతోంది

నిన్ను పలుకరించలేని నా నిస్సహాయత
నన్ను వెక్కిరిస్తుంది..అదే నాకుపిచ్చెక్కుతోంది

నిన్ను ఎంత పొగిడినా నాకు ఇంకా వెలితిగానె ఉంటుంద
అంతగా నిన్ను ఆరోదిస్తున్నాను ఇప్పటికి ఏప్పటికీ
ఆంత ఇష్టం నీవంటే అది గొంతులో ప్రానం ఉండే వరకు ఉంటుంది..

ఇదంతా మాటల మణిహారంలో కూర్చుదామంటే...
నీ ప్రేమ తపస్సులో మాటలు మౌనంగా మిగిలిపోయాయి

మనసులో భాదకు ఎవ్వరూ మందు కనిపెట్టలేదని..దీనిని కనిపెట్టారంట ...



ఈ మందు ఎవడు కనిపెట్టాడోగాని ....?
మనస్సు భాదగా ఉన్నప్పుడు ఈ మందు బాగా పని చేస్తుంది..
గుండేళ్ళో మంటలు ఆర్పలేదుకాని...
ఆ మంటల్ సెగలు పైకి అనిపించకుండా చేస్తుంది..
తాగేప్పుడు చేదుగా ..
గొంతులోకి వేళ్ళేప్పుడు మంటగా..
గుండేల్లోకి చేరగానే హాయిగా అనిపిస్తుంది..
ఆ మందు గుండెల్లోకి చేరగానే పనిచేయటం ప్రారంబిస్తుంది..
గుండేల్లో వేదన భాదని తన మత్తులో హాయిగా జోగేలా చేస్తుంది..
అప్పుడూ నీజ్ఞాపకాలు మొద్దుబారతాయి...తెలీని మత్తు ఆవరిస్తుంది..
అయినా అప్పుడప్పుడూ ఆ మత్తులో కూడా నీజ్ఞాపకాలు వెంతాడుతూనే ఉంటాయి..
అప్పుడు పెగ్గుల కౌంటర్ పెంచితే..గాని ఊరటరాదు..
అన్నిటికి ఇంగ్లీషు మందులు కనిపెట్టారు..?
మనసులో భాదకు ఎవ్వరూ మందు కనిపెట్టలేదని..దీనిని కనిపెట్టారంట ...
నీజ్ఞాపకాలు వేదిస్తున్నప్పుడు నాకిప్పుడు ఇదే నేస్తం..
నేస్తం నీవు నాకు దూరం అయ్యావని
ఈ నేస్తాన్ని (మందు) ప్రతిరోజు సాయంత్ర కలుస్తున్నాను ..
నీ గుర్తులు,జ్ఞాపకాలు అన్నీ మర్చిపొవాలంటే ఇంతకు మించిన స్నేహితుడు లేడు మరి నాకు

నా కళ్ల్ళలోనా.. నీకోసం కరిగించిన కన్నీళ్ళలోనా?




ఓ ప్రేమా ఎక్కడున్నావ్?
నా కళ్ల్ళలోనా.. నీకోసం కరిగించిన కన్నీళ్ళలోనా?
నా ఆశలోనా..నీ కోసం వొదిలేసే శ్వాసలోనా?
ఓ ప్రేమా ఎక్కడికెళ్ళావ్? ఊరించావు నిజమని నమ్మేలాచేశావ్
అన్నీ నిజమనుకొని నీవే నా ప్రానం అనుకొని..నమ్మిన క్షనాన
నా నమ్మకాన్ని ఒమ్ముచేసి..నన్ను ఒంటరివాన్ని చేసి..
తీరని వేదన భాదను నా మనసుకొదిలి నీవెక్కడికిపోయావు
తీరాన్ని వొదిలెల్లే అలలా...దూరాన్ని దరిచేర్చే దిశలా.
ఓ ప్రేమా ఎందుకెళ్ళావ్?అని అడుగుతున్న నిన్నే..?
చిగురించిన చిన్ని ఆశలను చితి మంటకు చేర్చేందుకా,
గుండె పగిలిన ప్రేమికుడి రోదనతో మరో ప్రేమ సౌధాన్ని పేర్చేందుకా!

ఎందుకొచ్చిందీ తేడా ఇలా ఎలా ఎందుకు మారావని అడుగలేను ..?




ఎందుకిలా చేస్తున్నావు...ఏంజరుగుతోంది...
ఒకప్పుడు నీవు నా హృదయాన్ని ఎంత అపురూపంగా చూసుకున్నావు..
ఎక్కడ నేను భాదపడతానో ప్రతి క్షనం మదన పడేదానివి..
నన్ను నాహృదయాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు..
చిన్న గాయం అయినా తగలకుండా అవకాశం లేకుండా..
ప్రపంచంలో నాలాంటి అదృష్టవంతులు లేరని తెగఫీల్ అయ్యేవాడీని
ఇప్పుడు నా హృదయాన్ని కాళ్ళకింద తొక్కి ఆనందిస్తున్నావు.
అప్పటికీ కొందరి కసి తీరలేదేమో పదునైనకత్తితో దారుణం గా పొడిచావు..
రక్తం ఓడుతున్న నా హృదయాన్ని చూసి నీవు పగలబడి నవ్వుతున్నావు..
అంతకంటే దారుణంగా నాహృదయం తగల పడిపోతే బాగుండనుకుంటున్నావు
ఎందుకొచ్చిందీ తేడా ఇలా ఎలా ఎందుకు మారావని అడుగలేను
నేనైపోతున్నానో పట్టించుకోవడంలేదు....
హృదయాన్ని ఎందుకిలా గాయం చేశావు ...
ఇప్పుడర్దం అయింది నీవేం కోరుకుంటున్నావో ..
నేను నీకు కనిపించకూడదు ..నా మాట నీకు వినిపించకూడదు..
నామాట వినిపిస్తే చిరాకు..నేను నీకు కనిపిస్తే......?
సారి అర్దం చేసుకోలేక పోయా ఇప్పటిదాకా..నీకోరిక త్వరలో నెరవేరుతుంది..
నీవు ఊహించనంత దారుణంగా..ఉంటుంది అదిచూసి నీవు హేపీగా ఫీల్ అవుతావు.
.....నీవు నీతో పాటు మరో వ్యక్తి కోరుకునేది అదేగా..

Friday, June 24, 2011

చలం సాహిత్యంలో " సుగంధి" కధ





చలం సాహిత్యంలో " సుగంధి" కధ...

చలం సాహిత్యంలో అన్నీ చీకట్లో జరిగే నిజాలే ఉంటాయి..స్త్రీలకు కట్టు బాట్లున్న సమయంలో కూడా స్త్రీకు స్వేచ్చకావాలని కోరుకున్నవారిలొ చలం ఒకరు...అలాంటి రోజులు తెరవెనుబ బాగోతాల్లా కనిపిస్తున్నా..జీవితాళ్ళో జరుగుతున్న వాస్తవాలు..వాస్తవ పరిస్థితులను ఎత్తి చూపే ప్రయత్న చేసాడు చలం...ఈ మద్యినే చల సాహిత్యాన్ని చదువుతున్నా ...చలం పుస్తాకాల్లో " కొత్త చిగుళ్ళు" లోని "సుగంధి " కధ నాకు నచ్చింది...

కధ లో సుబ్రమన్యిం బిజినెస్ చేస్తుంటారు..ఈ కధ మెదట్లోనే అప్పటి సామాజిక పరిస్తితులు ఎలా ఉంటాయో చెప్పుకొచాడు చలం అది ఇప్పటీ తరాని కి పనికి వస్తుంది..అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి మనుష్యుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుస్తాయి..అలా పనిమీద వెళ్ళీఅన సుబ్యమన్యానికి అనుకోకుండా పరిచయం అయింది అందాల బరిణి సుగంధి..పరిచయం సమయంలో ఇద్దరి మద్యా సజ్ఞలే..మాటల్లేవు..ఒకరి భాష ఒకరికి తెలీదు...ఒకర్ని ఒకరు చూసుకోని భావోగ్వేదానికి లోనయ్యారు అదేంటీ అదేనా ప్రేమంటే...ఇష్టం అంటే వారిద్దరి పరిచయంలో సౄంగారం మేలవించి సుగంధి అందాల ను చెప్పకనే చెప్పాడు చలం ..అలా మొదలైన పరిచయం విడదీయలేని బందంగా మారింది ఇద్దరికీ...అప్పటికే సుబ్రయన్యానికి పెళ్ళీఅయింది అయినా దైర్యం చేసి సుగంధిని ని ఇంటికి తీసుకెల్లాడు..ఇంకేముంది కధ మామూలే ఇంట్లో వాళ్ళూ వప్పుకోలేదు అప్పట్లో కట్టు బాట్లు అంటు ఏడ్చాయికదా..అయినా ససేమిరా అంటూ సుగంధి నిని పెరట్లొ ఉంచాడు సుబ్రమన్యిం..మొదట్లో ఎవ్వరీ పిల్ల వంటి మీద బట్టలు కూడా సరిగ్గాలేవు అని చీదరించుకున్న వాళ్ళే సుగంధి అందాని ముగ్దులై మాటలు అనటం మానేసారు..ఈ లోగా సుబ్రమన్యిం భార్యి తరపువాళ్ళు వీల్లిద్దరి మద్యి విలన్ లు అయ్యారు..ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేశారు..సుబ్రమన్యిం లేనిది చూసి సుగంధి పైదాడికి ప్రయత్నిస్తే సుగంది పారిపొయింది...అలా ఓ లంబాడి తండాలో చేరింది అక్కడ పరిచయం అయ్యాడూ మల్లన్నా కండలు తిరిగిన శరీరం..మెరటు మనిషి ఎలాగోలా సుగంధి ఆచూకి తెల్సుకొని వెంట తెచ్చుకున్నాడు...సుగంధి తనతో మల్లన్నను తెచ్చుకుంది సుబ్రమన్యిం ఎవరు అని అడిగితే మావాడే నాకోసం తెచ్చుకున్నా దైర్యంగా ఉంటుందని చెప్పింది సుగంధి..సుగంధి , సుబ్రమన్యిం కల్సిఉన్నప్పుడు దగ్గరకు రాడు ఎక్కడో దూరంగా ఉంటాడు.అలా ఊరెళ్ళీన సుబ్రమన్యిం అనుకొకుండా ముందుగా వచ్చి సుగంధిని చూడాలని వస్తే అక్కడ ఓ సంఘటన చూసి అవాక్కైయ్యాడు సుగంధి మల్లన్న ఇద్దరూ సృంగారంలో మునిగి తేలుతున్నారు...ఈ ఘటన చూసిన సుబ్రమన్యిం తట్టుకోలేక పోయాడు ఏమీ తెలియనట్టు వెనుదిరిగి పొయాడు..మరుసటీ రోజు ఏమీ ఎరుగనట్టూ రాత్రేంజరగనట్టూ సుగంధి ఉండాటాన్ని చూసి ఆ నటనను చూసి ఆచ్చర్యి పొయాడు సుబ్రమన్యిం..దైర్యిం చేసి భాదను గుండెళ్ళో దిగమింగుకొని సుగంధి రాత్రి జరిగిన విషయం అడిగాడు ఎలా తెల్సిందాని సుగంధి మొదట తడబడ్డా అసలు విషయం ఒప్పుకుంది నాకు మల్లన్న అంతే ఇష్టం అని.మరి నేను అంటే నీవంటే కూడా ఇష్టం అంది ..అలా ఇద్దరితో సుగంధి ప్రణయం సాగిస్తుంది ...ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డ సుగంది ఇలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు..భాద పడ్డాడూ పిచ్చివాడుగా తిరిగాడు...మల్లన్నను ఎలాగైనా చంపాలనుకున్నాడు...ఆప్రయత్నంలో ఇద్దరూ గొడవపడుతున్నప్పుడు మల్లన్న సుగంది తనకు దక్కదని కసిదీరా పొడీచాడు గుండెళ్ళోంచి రక్తంద్దారలు గా కారుతోంది అపుడూ కాని సుగంధికి ఎవ్వరిది నిమైనా ప్రేమో తెల్సుకుంది కాని మల్లన్న పారిపోయే ప్రయత్నం చేయగానే పోలీసులు పట్టుకున్నారు....మరి ఈ కధలో విజయం ఎవ్వరిది ప్రేమద సృంగారానిదా...? మనిషిలోని నమ్మాకాన్ని ప్రేమను మోసం చేసి...తన శరీర సుఖం చూసుకున్నా సుగంది చివరికి ఏంతెల్సుకుంది....శరీరసుఖం ఆస్వితంకాదు గుండెల్లో ప్రేమ శాశ్వితం అదే నీకు తోడూ నీడగా ఉండీ నిన్ను రక్షిస్తుంది అనే కదా

ఇంతగా ఇలా మారిపోతానని నేను కలలో కూడా అనుకోలేదు తెలుసా..




భాదపడటం అలవాటైంది..ఎందుకంటే ప్రతి నిమిషం జరిగేది అదేగా..
నా మీద నాకు ఎప్పుడో నమ్మకం పోయింది...దిగులుగా ఉంది..
నా స్నేహం మీద..నా ప్రేమ మీద నమ్మకం పోయంది..
ఇప్పుడు నన్ను నేను కూడ నమ్మనంతగా మారిపోయాను తెలుసా..
అవును తెల్సుకోవాల్సిన అవసరం నీకేంటి..నే నెవ్వరిని..
ఇంతగా ఇలా మారిపోతానని నేను కలలో కూడా అనుకోలేదు తెలుసా..
నేనిలా మారటానికి కారణం నీవే ..
నీవు నా జీవితం లో ప్రవేశించాకే మొదలైంది..
నీవు దూరం అయ్యాక రూఢీ అయింది..
అందుకే నన్ను నేను నమ్మటం మానివేశాను..
నీవు ఎదురుగా వచ్చి నాతో ఇదివరకటిలా మాట్లాడినా నమ్మలేనంత మారిపోయా..
అప్పటి నీనవ్వులు..నీమాటలు ఇంకా నాపక్కన ఉండి మాట్లాడి నట్టుంది ..
అప్పుడు తెలీలా ప్రియా అది శాశ్వితం కాదని నిజం అని నమ్మా..
అప్పుడు తెలిదు అవన్ని ఒట్టి బ్రమలని ..అవే శాశ్వితం అని నమ్మా
మనసులో కొండంత భాద పెట్టుకొని బైటికి నటించడం కష్టంగా ఉంది..
నలుగురితో హేపీగా ఉన్నట్టు నటించడం నావళ్ళ కావడంలేదు..
అవును ఇప్పటికీ నాకూఅర్దం కానివి చాలా వున్నాయి తెలుసా..?
ఎవ్వరు భాదపడ్డా తట్టుకోలేవు నేను తప్ప ఎందుకని..
ఎవ్వరికి ఎమైందని తెలిస్తే అంతగా ఫీల్ అవుతాను నాకు తప్ప..
అందరి తో బాగుంటావు నా ఒక్కడీతో తప్ప ఎందుకని అలా..?
నిజంగా నేను మంచి వాడిని కాదుకదా అందుకే ఇలా చేస్తున్నావు..
ఒకప్పుడు ఉన్న ఇష్టం ఏమైంది ఇప్పుడు...
అవును నీకు నేనంటే ఇష్టంలేదు కదా అందుకే ఇలా చేస్తున్నావా..
నీకు చూడాలనుకున్నా కనిపించనంత దూరం పోతున్నాలే..
ఒకవేల నీ మనస్సు మారి నన్ను చూడాలనుకున్నా నీవు చూడలేవు...
" I MISS U " అని నీవు ఎవ్వరికైనా చెప్పి
ఉంటావు నాకు చెప్పే అవకాశం ఇవ్వను GUD BYEE 4 Ever..

మూసిన కనుల వెనక మూగబోయిన కన్నీటి శబ్దాలు..




నీకోసం ఇప్పటికీ నిదిర లేని రాత్రులు గడుపుతున్నాని నీకు తెల్సు
మూసిన కనుల వెనక మూగబోయిన కన్నీటి శబ్దాలు..
మూలకి విసిరేసిన చిత్తు కాగితాలు....
నీకోసం పిచ్చిరాతలు బ్లాగుల్లో రాస్తూనేను
నన్ను నాకే వొదిలేసి వెళ్ళిన నువ్వు..
చిత్రం కదూ...
మనసు అగ్నిగుండంలా తగల బడుతోంది నీకోసం
మనసు కాలుతున్న వాసన,
కాలి కాలి బూడిదైఏందుకు సిద్దంగా ఉంది
ఏ మూలో మిణుకు మిణుకు మంటున్న ఆశ...
నువ్ రాక పోతావా. అని
కానీ నా మనసుకి భాష రాదు
ప్రేమ ఘోష తప్ప..
ఆశ చావక విరహాగ్నిలో ఇలాగే పోతాను ..
ఇది మాత్రం నిజం నీవస్తావనేది కళ్ళగానే మిగిలిపోతుంది.

Thursday, June 23, 2011

కలలు కళ్ళలై కన్నీల్లు మిగిలాయి..




నే ఒంటరిని కాను"
నా కనులకు తెలుసు
నే నిన్ను చూడలేనని..!!
నా మనసుకు తెలుసు
నే నిన్ను చేరలేనని..!!
నువ్వు లేవని తెలుసు..
ఇక రావని తెలుసు..
అయినా.. నా నేస్తం నే ఒంటరిని కాను
నీ తలంపులు నాతో ఉన్నంత కాలం
కలలు కళ్ళలై కన్నీల్లు మిగిలాయి..
నీ వెవరంటూ ప్రశ్నిస్తున్న కాలం..
నా కెందుకు దూరం అయ్యావు..
నీవెక్కడ ఉన్నావు..
ఎలా ఉన్నావు అంటూ నామనస్సు నిన్నడుగుతోంది..
అందుకే ఈ భాద బరించలేక పోతున్నా..
నీకు కనిపించని వినిపించనంద దూరానికి

మొత్తానికి "ఓబుల్ రెడ్డిని ఓడించి" నీవే గెలిచావురా..?




మొత్తానికి "ఓబుల్ రెడ్డిని ఓడించి" నీవే గెలిచావురా..?

నీ ప్రేమ మీద నీకు నమ్మకంలేదు..
నీ స్నేహం మీద నీకు నమ్మకం లేదు..
నీ బందం మీద నీకు నమ్మకం లేదు..
మరి ఇన్ని అనుమానాలున్న నీవు ఏంచేయాలి...
ఎలాగోలా ఎదుటి మనిషిని దెబ్బతీయాలి..
అందుకే నా స్నేహాన్ని అడ్డుగా పెట్టుకొని డ్రామాలాడావు..
మగాడి వై ఉండి ఆడదానిలా ఏడుస్తూ అనుకున్నది సాదించావు
అందుకే నన్ను బకరాను చేశావు.....
నేను నిన్ను నమ్మానురా ..
నీవు హేపీగా ఉడాలనే కదురా నేను కోరింది మరి నీవేం చేసావు..
మానసికంగా దెబ్బతీశావు..జీవితం మీద దెబ్బకొట్టావు..
నీ స్వార్దం కోసం ఏన్ని డ్రామాలాడావురా..అందరిలా నేను నమ్మా..
నీవు బాగుండాలని కోరుకున్న నన్నే జీవితంలో కోలుకోలేని దెబ్బ తీశావు..
జీవితంలో ఎక్కడ దెబ్బకొట్టాలో అక్కడ గురి చూసి కోట్టావు..
నీవనుకున్నది సాదించావు..తిరుగులేని విజయం హేపీగా ఉన్నావు..
నీక్కావలసింది దొరుకుతుందీ....ఎంజాయ్ చేస్తున్నావు..
నీవల్ల ఎదుటివాడు జీవితం నాశనం అయిందని ఒక్కసారన్నా ఆలోచించావా..
అసలు నీవు మనీషివి అయితే కదా మానవీయ విలువకు తెలిస్తేకదా..
అప్పుడు నీవుకొట్టిన దెబ్బకు ఇంకా నేను విల విల లాడుతునే ఉన్నా..
నీవు మాత్రం హేపీగా అమాయకుడిలా నీకు కావల్సింది దక్కించుకొంటూ నటిస్తున్నావు
అప్పుడు నీవు చేసిన దానికి ఎప్పుడు ఎక్షనాన ఊపితి ఆగిపోతుందో నన్నట్టున్నా..
ఏదోరోజు ఏదో ఘడియలో నా ఊపిరి పోతుంది ...దానికి కారణం మాత్రం నీవే..
ఇలా నమ్మకంగా నీవు ఓ మనిషి జీవితంతో ఆడుకొని ఏంచేస్తావురా..
నీవు నీ ఫ్యామిలీ మొత్తం నాలాగే భాదను అనుభవించినప్పుడు తెలుస్తుంది ..
ఓ మనిషి ప్రాణం పోవడానికి కారనం అవుతున్న నీవు..బాగుపడతావురా...?
నీవు పెట్టిన చిచ్చుకు నేను ఏ క్షనానైనా అనంత లోకాల్లో కల్సిపోవచ్చు..BYEE

http://obulreddi.blogspot.com...> బ్లాగ్ స్పాట్ లోనిది

నీ మౌనమేంతో బరువై ........నీ మాటలన్నీ కరువై ......





నీ మౌనమేంతో బరువై ........నీ మాటలన్నీ కరువై ......
నీ మౌనమేంతో బరువై ........నీ మాటలన్నీ కరువై .......
మనసులో భాద తట్టుకోలేక...నిజాన్ని నమ్మలేక
రెప్ప పడదు ఏ కంటికిన నిను కలిసే దాక ...........
నీ పరిమళాల చందనాలే ..ఇంధనమై నను మండిస్తే.........
నువ్వు రేపిన ఆశలే నన్ను నిద్దుర పట్టనీయకుండా చేస్తున్నాయి
నీ జ్ఞాపకాలలో బందినయ్యాక....ఏమి చేయాలో అర్దకాక ఆకాశం వైపు చూస్తున్నా ఇలా
నిను చేరుతానన్న ఆశచావక ఎన్నాల్లిలా ఏన్నేళ్ళీలా ప్రియా
ఈ ప్రాణమెందుకు ఇక ..కన్నీటి కడలోకలిసేందుకు ...వెలుతున్నాలిలా

కంటి ముందే కలవై కరిగిపోయవు సుమా!






నిన్ను అందుకోవాలనుకున్నాను నేస్తమా,
కానీ అందనంత ఎత్తులో ఒదిగిపొయావు సుమా!
నిన్ను కళ్లలొ దాచుకోవాలనుకున్నాను నేస్తమా,
కంటి ముందే కలవై కరిగిపోయవు సుమా!
అలగా నీ ప్రణయ తీరాన్ని చేరుకోలేక,
శిలగా మారిపోతున్నాను,
ఒక బండ గా ఉండిపోతున్నన్నాను...ఈ నాటికి!
నిన్ను చేరేనా ఏ నాటికీ?

ఎందుకంటే నిన్న నీది కాదు గడిచిపొయింది కాబట్టి,




స్నేహం చెయ్యాలన్నా ఈ క్షణమే,

ప్రేమించాలన్నా ఈ క్షణమే,

బ్రతకాలన్నా ఈ క్షణమే,

బ్రతికించాలన్నా ఈ క్షణమే,

సమయంలేదు అనుకున్నా తిరిగిరాదు

ఎందుకంటే నిన్న నీది కాదు గడిచిపొయింది కాబట్టి,

రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి
అది నాచేతుల్లో ఉంది నిర్నయం తీసుకున్నా నీవేంచేయలేవు

Wednesday, June 22, 2011

కొన్ని గుండెలు పగిలేలా అరిచిన అరుపులు ఎవరు వినలేరు ..





జడివానలు జీవిత కాలం ప్రయత్నించి అలసి ఆవిరిపోయాయి ..............
మలయమారుతాలు స్వభావం మారిపోతుందనే భయం తో మద్య లోనే వెను దిరిగాయి .........
సముద్రాలు దాని తీవ్రత తెలియక తమ గర్భం లో దాచుకున్నాయ్ .................
జీవమా , నిర్జీవమా,దేవుడా ,దెయ్యమా......ఎవరైతేనేం ...........
తన ఉచ్వాస , నిశ్వాస ల ఉనికి కూడా భరించలేరు ..........
కొన్ని వేదనలకి జోల పాటలుండవు...ఆవేదనకు అంతుడదు
కొన్ని గుండెలు పగిలేలా అరిచిన అరుపులు ఎవరు వినలేరు ..
దాన్ని మండనివ్వండి ......ఆమంటల్లో కాలుతున్నా ఓ శవం ఆర్తనాదాలు ఎవ్వరు వినాలి
తన శరీరం చితిలా కాలి పోయేవరకు .......
ఆ జాడలు తనకో కొత్త రూపాన్ని ఇచ్చేవరకు .....
మనం అనుభవించలేని ఆవేదనలో సౌందర్యాన్ని వెతుక్కొనే వరుకు .....
అక్కడో అగ్ని పర్వతం మండుతుంది దాన్ని మండనివ్వండి .........
ఎంత అగ్ని జ్వాల లైనా చివరికి కాలి బూడిదగా మిగల వల్సిందేగా......
అమె అన్నీనిజాలు తెల్సుకొని వచ్చేవరకు కనీసం బుడిదైనా మిగులుతుంది..
అప్పటికీ ఆలస్యిం అయితే వర్షపు నీళ్ళలో కల్సిపోయి అదికూడా మిగలదు ప్రియా

గతం మిగిల్చిన గాయాల్ని తడుము కొంటూ..దీనంగా వేదనగా..





నిండి పొయింది నా మనసు నీ రూపంతో ఒకనాడు,
అదే నా మనసు నిండి పొయింది బాధలో నీ లేమితొ ఈనాడు,

కలలన్ని కధలయ్యయి, కన్నిళ్లే వరమయ్యయి,
వెన్నెల సైతం కాల్చెస్తుంది నీ విరహ వేదన తొ,

మనిషిని వేదిస్తున్న మనసు..దరిచేరవా అంటూ..
నేను ఒకప్పటి మిత్రుడిని కాదు..శత్రువుని అన్నా వినదు

కన్నీటి సుడిగుండంలో కారనాలు వెతకాలని చూసాను..
మేం విడిపోవడానికి కారణం దొరకలేదు.. ఆవేదన్ తప్ప..

ఆగదు నా హ్రుదయం ఈ క్షణం నీవు లేవని,
ఎదురు చూస్తుంది నీవు వచ్చె క్షణం కొసం............

కదిలే కాలాన్ని ఆపలేను..మదిలోంచి నిన్ను దూరం చేయలేను..
నన్ను మర్చి నీవు హేపీగా ఉన్నావు ..ఎలా అని అడుగలేని నిస్సహాయున్ని..

ఒకప్పటి నిజాలు అన్ని షడన్ గా అబద్దాలు గా మాయాయేమో..
ఎందుకిలా ఎమైందలా అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు వెంటాడూతున్నాయి..

గతం మిగిల్చిన గాయాల్ని తడుము కొంటూ..దీనంగా వేదనగా..
తిరిగిరాని గతం కంటే ..వేదన మిగిలిచిన ప్రస్తుతం కంటే ..
ఈ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత కదా...?
జరిగే ఘోరాన్ని అడ్డుకోలేవు ...పోయే ప్రాణాన్ని ఆపలేవు

సున్నితంగా ఉండే వాళ్ళు ఈ పోష్టు చూడకండి....?

ఇది చాలా దారుణంకదా ...ఇలాంటివి చూస్తే నీకేమనిపిస్తుంది.
నీకు భవిష్యత్తులో ఇలాంటిది నీకు ఎదురైతే ఎంచేస్తావు.....?
ఒకప్పుడు నీవు బాగా ఇష్ట పడ్డ వ్యక్తి ని నీవు ఇలా చూడాల్సి వస్తే..?
కొందరు మనస్పూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన పాపానికి ఇలా బలౌతారు..తప్పని పరిస్థితుల్లో..
ఇలా చేయడం ఎంత వరకు కరెక్టో తెలీదుకాని అప్పుడు ఆక్షనం లో వారికి తోచిన నిజం...తప్పని పరిస్థితి అయినా తప్పేనా ...?

Tuesday, June 21, 2011

నిశి రాత్రి నీ జ్ఞాపకాలు నన్ను కలవపరుస్తుంటే,




నిశి రాత్రి నీ జ్ఞాపకాలు నన్ను కలవపరుస్తుంటే,

నిదుర నాకు దూరమై, వేదన చేరువై,

నా మది నీ తలపులతో పరితపిస్తుంటే,

నా ఉహల్లో నీ ప్రతిబింబం నన్ను మైమరచగా,

నీ సాన్నిత్యపు తన్మయత్వంలో ఓ మధుర స్వప్నపు నీడలో నేను సేద తీరుతుంటే,

కాలం కరిగిపోయింది,రాతిరి వెళ్ళిపోయింది,

స్వప్నం చెదిరి పోయింది,మళ్ళీ వేదనే నాకు మిగిలింది.. మరణం దగ్గరవుతోంది.

అందరూ ఎందుకు నాలా ఆలోచిస్తున్నారు..





అందరూ ఎందుకు నాలా ఆలోచిస్తున్నారు..
నేనిలా అంటున్నాను అంటే రీజన్ ఉంది..మరి అందరికి..
ఓ విషయంలో గెలవలేనంతగా ఓడిపోయా కాబట్టి తప్పదు
నా నిర్నయం నేను తీసుకోని పోదామంటే ఇదేంటి ఇలా జరుగుతుంది...
ఎందో గుండె దైర్యం ఉన్న వారు కూడా ఇలా డీలా పడీపోవడం ఆచ్చర్యం వేసింది..
నేను ఎందుకు సహాయం చేయలేకపోయా అని భాద వేసింది..
... ఆవకాశం ఉండీ నేనెందుకు సహాయం చేయలేక పోయాను...?
....కోచెం సమయం ఇచ్చి ఉంటే ..ముందుగా చెప్పి ఉంటే బాగుండేది
... నిజమే ఎదైనా అనుభవిస్తున్నా వారికే ఆ భాదవిలువ తెలుస్తుంది...
స్నేహితుల మై ఉండీ ఆమెకు ఆ ఆలోచన రాకుండా చేయలేకపోయా0 ..?
నిజమే డబ్బు చాలా నీచం అయింది ఎంతటి మనిషిని అయినా కుంగదీస్తుంది..

http://obulreddi.blogspot.com ...లోనిది

Monday, June 20, 2011

ఎంచేయాలో తెలీక ఓంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నా..ఎందుకో ఈ వేళ




ఆ క్షణం
మొదటిసారి …..నీ కాళ్ళ ఎదుట నిలిచిన … రోజు కావలి ..
మొదటిసారి …..నీ తో నడిచిన పయనం కావాలి ..
మొదటి సరి …..నీ తో మాట్లాడిన క్షణం కావలి ..
మొదటిసారి నిన్ను తాకిన పులకరింత కావాలి మల్లి కావాలి..
ఒక్కసారి ………… ఎన్నో చెప్పాలనుకున్న కానీ కుదరలేదు .
ఎన్నో మాట్లాడాలనుకున్న కానీ కుదరలేదు…
ఆక్షనాని మళ్ళీ తిరిగి వస్తాయా..కనీసం కలలోనైనా..
ఒకప్పటి నిజాలు ఇప్పుడు అబద్దాలు గా మారాయి..
గుండెకు గాయాలు చేశాయి ..ఎప్పటికీ ఆగాయం మానేలా లేదు...
ఎంచేయాలో తెలీక ఓంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నా..ఎందుకో ఈ వేళ
తిరిగిరాని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ..చీకటైనా భవిష్యత్తుకు తలచుకొంటూ..

ఇది చాలా దారుణంకదా ...ఇలాంటివి చూస్తే నీకేమనిపిస్తుంది

ఇది చాలా దారుణంకదా ...ఇలాంటివి చూస్తే నీకేమనిపిస్తుంది.
నీకు భవిష్యత్తులో ఇలాంటిది నీకు ఎదురైతే ఎంచేస్తావు.....?
ఒకప్పుడు నీవు బాగా ఇష్ట పడ్డ వ్యక్తి ని నీవు ఇలా చూడాల్సి వస్తే..?
కొందరు మనస్పూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన పాపానికి ఇలా బలౌతారు..తప్పని పరిస్థితుల్లో..
ఇలా చేయడం ఎంత వరకు కరెక్టో తెలీదుకాని అప్పుడు ఆక్షనం లో వారికి తోచిన నిజం...తప్పేనా తప్పని పరిస్థితి అయినా ...?

ఎవ్వరన్నా ఆప్యాయంగా మాట్లాడుతుంటే వింతగా అనిపిస్తోందెందుకో..





నాది అనుకున్నది ఎవ్వరికి దక్కకూడదనే స్వార్దం..నాకు ఎప్పుడూ
నా వాళ్ళు అనుకున్నప్పుడు వారికోసం ఎమైనా చేయటానికి సిద్దం నేను..
అలాంటి నాకు ఓ స్నేహం ప్రాణవాయువులిచ్చాయి ..ఇప్పుడే అదే ప్రాణం పోయేలా చేస్తుంది..
మనుష్యుల్ని నమ్మాలనిపించడంలేదు..వెలుతురు అస్సలు నచ్చడంలేదు
చీకట్లో ఒంటారిగా ఉండాలనిపిస్తోంది..ఏకాంత హాయిగా ఉంటోంది..
ఎవ్వరన్నా ఆప్యాయంగా మాట్లాడుతుంటే వింతగా అనిపిస్తోందెందుకో..
ఎవ్వరన్నా ఇష్టంగా మాట్లాడుతుంటే...కష్టంగా అనిపిస్తుంది
అవును ఒకరికోసం ఒకరు అని ఎలా ఉంటారు అవన్ని నిజాలేనా..
ప్రాణం ఇచ్చేంత స్నేహం ఉంటుందా అస్సలు ..అన్నీ అబద్దాలుకదా..
ఒకరంటే ఒకరు ప్రాణంగా ఒకరికొకరుగా ఎలా ఉంటారు..విడిపోకుండా..
విషపురుగులు కూడా స్నేహితులైతే చచ్చేవరకు కల్సే ఉటాయంట
మరి మనుష్యులు ఎందుకలా ఉండరు ...వారికి మనస్సుంటుందా..
ఆలా లేని వాళ్ళకు మనస్సు చచ్చిపోతుందా..ఎలా ఉంటారు అలా..

కంటినిండా కన్నీరు.. గుండెల నిండా చెప్పుకోలేనంత భాద..




అసలు స్నేహం అంటే ఏంటి...ప్రేమంటే ఏంటి..?
స్నేహం అంటే టైంపాస్...ప్రేమ అంటే మోసం..?
అవునుకదా ఒకప్పుడు చాలా ఊహించుకున్నా...
అనుభవం మీద ఎన్నో తెల్సుకున్నా..ఏదీ నిజంకాదని..
అన్నీ నిజాలు అని నమ్మితే ..మీకు మిగిలేది..
కంటినిండా కన్నీరు.. గుండెల నిండా చెప్పుకోలేనంత భాద..
మనిషికి మనిషికి మద్యి ఏర్పడ్డ బందాల్లో ఏంటీ తేడా...
నిజాలని నమ్మి బ్రమలో బ్రతక్కండి..
జీవితంలో తట్టుకోలేనంత భాద మిగులుతుంది.....
నాది అనుకున్నదేది మనది కాదు అనుకున్నప్పుడు...కనిపించేది సూన్యిం
ప్రేమ .స్నేహం అనేవి గొప్ప పదాలు ఒక్కసారి దక్కితే...
గొంతులో ప్రాణం పోయేవరకు నిలబడాలి ..ఎలాంటి పరిస్థితులొచ్చినా..
చివరకు ఆస్నేహం వల్ల ప్రాణం పోతుందన్నా హాయిగా ఇచ్చేయాలి..
స్వార్దం అస్సలు ఇద్దరి మద్యికు చేరకూడదు..
కష్టం అయినా సుఖం అయినా ఇద్దరూ కల్సి ఉండాలి...
నేను నమ్మిన నాస్నేహంకోసం ఇప్పటికైనా నేను దేనికైనా సిద్దం..

కాలం నన్ను మోసం చేసింది, నిన్ను నానుండి దూరంచేసి




కాలం నన్ను మోసం చేసింది, నిన్ను నానుండి దూరంచేసి
మనసు నన్ను మోసం చేసింది నన్ను వదిలేసి నిన్ను చేరి
చివరికి నువ్వు కూడ నన్ను మోసం చేశవు నన్ను ఒంటరిగా వదిలేసి
అందుకే మరణాన్ని అడిగాను తనులేనప్పుడు నేనెందుకని
అది కూడ నన్ను మోసం చేసింది ఎంత చెప్పినా వినటంలేదు..
ఎవ్వరిని లెక్క చేయాల్సిన అవసరంలేదు..జరిగిపోవాల్సిందే

నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా బ్రతికుంటాననుకున్నావు.





నీతొ నడిచిన క్షణాలన్ని నన్ను ఇప్పుడు ప్రశ్నించాయి,
ఎందుకు మళ్ళీ మాకు ఆ అవకాశం ఇవ్వలేదని,
నీతొ మాట్లాడిన నా హృదయం నాకు చెప్పింది,
తను కలిసే దాక మాట్లాడనని మనస్సు మొరాయిస్తుంది

నీతొ నడిచే నా పాదలు చెప్తున్నాయి,
తమతొ పాటు నడిచే నీ పాదలు లేనిదే అవి కదలమని,
కాని వాటికేం తెలుసు నువ్వింక తిరిగి రావని,

నా మనస్సుకు దూరం అయి మరో....?
నన్ను ద్రోహిని చేసి పోయావని ఎన్నిసార్లు చెప్పినా
మనస్సు మారాం చేస్తుంది...ఎలా చెప్పను ఏమని చెప్పను


నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా బ్రతికుంటాననుకున్నావు.
నీ జీవితానికి అడ్డురాను నీవు సంతోషంగా ఉండాలి
నీవు మోసమోతున్నావు ...అని తెల్సుకునే సరిని నేనుండానేమో..

ఏవి జరుగ కూడదని అనుకుంటున్నానో అవే జరుగుతున్నాయి..
నాకిక తట్టుకునే శక్తి లేదు..మనస్సు నీరస పడుతోంది నిజం
భావోద్వేగాల్లో బందీనై విలపిస్తున్నా ఎంజరుగుతోందని..

కనికరం జాలి లేని మనుష్యుల మద్యి బ్రతకలేం అని మనస్సు తేల్సింది..
ఈ మనుష్యులు ఇంతే వద్దు ఎవ్వరూ వద్దంటూ కన్నీరు పెడుతోంది మనస్సు.
నేనేమయింది ఆనవళ్ళూకూడా నీకు తెలియకూడదని పిస్తొంది..
తెల్సినా నీవేంచేస్తావు...హేపీగా ఫీల్ అవుతావుకదూ...?



నా కళ్ళకి చీకటి అలుముకుంది,
నా శరీరం చల్లబడింది,నా గొంతు మూగబొయింది,
నా గుండె ఆగిపొయింది,
శరీరాన్ని రాబందులు పీక్కు తింటున్నాయి..
శరీరం నుంచి విడిపోయిన నేనే నీవేంచేస్తున్నావని నీకోసం వచ్చా..
మరొకరి కౌగిలికో హేపీగా ఆనందంగా ఉన్నావు..తట్టుకోలేక పోయాను

ఇలాంటి ఘటనలు చూడలేకే..ఇలా అయ్యాను..
నా నిర్నయం తప్పుకాదనిపించింది..
ఇవన్నిటిని చూడలేక పొతున్నా పారిపోతున్నా...
ఎక్కడికి పోతున్నానో ఎందాకా పోతున్నానో తెలీదు..
ఎంత పరుగులు తీస్తున్నా అలుపు రావడం లేదు..
గుండె నిండా దుక్కం నాకు అలుపు అనిపించడంలేదు..
నాకిప్పుడు శరీరం లేదు ఆత్మగానే పరిగెడుతున్నా..

Sunday, June 19, 2011

ఆత్మ'హత్య'




గుట్టలు గుట్టలుగా
శవాల కుప్పలు

తల లేని మొండెం
ఆత్రంగా తడుముకుంటోంది

ఆగిపోయిన శ్వాస
నిశ్శబ్ధంగా ఆవిరవుతోంది

మూతబడిన కనులు
రెప్పల్లోంచి చూస్తున్నాయి

తెరుచుకున్న నోరు
కొత్త వేదం పలుకుతోంది

తెగిపడిన చేయి
గుండె కోసం వెదుకుతోంది

రాబందుల రెక్కలతో
కాళ్లు ఎగురుతున్నాయి

చుట్టూవాలిన ఈగలు
మౌనగీతం పాడుతున్నాయి

దూరంగా నేను
మౌనంగా చూస్తున్నాను

ఆత్మను చంపి
అంత్యక్రియలు చేస్తున్నాను

దూరంగా చూస్తున్న రెంటు కళ్ళు..
నాకు ఎంతో నాకిష్టమైన ఆ రెండు కళ్ళు
ఎప్పుడు దూకుదామాని అంటున్న కంటి నిండా నీరు..

నేను తన నుంచి దూరం అయినందుకు...
వస్తున్న కన్నీళ్ళా..?

పీడా విరగడైంది ..?
అంటూ వస్తున్న ఆనంద భాష్పాలా..?

- నరేష్ ,నేను

మళ్లీ ఆ వెన్నెలనాటి కమ్మదనాన్ని అందించవూ...




సాయం సంధ్యలలో
భానుడి పసిడి కాంతులలో
నీ అధరాల మృదు పలుకులను
ఆస్వాదించాలనే ఆశ... అడియాసే అయ్యింది


ఐతేనేం... పున్నమి వెలుగులలో
నా ప్రేమ మనసు నీకై ఆరాటపడింది...
నాడు వెన్నెల రాజు కాంతుల్లో...
దూరంగా నడిచి వస్తున్న నిన్ను చూసి

నా మనసు పండువెన్నెల్లో ఊయలలూగింది
వెన్నెల దేవతలా కదలి వచ్చి
నను పెనవేసుకున్న ఆ క్షణం...
నా అణువణువు ప్రేమ స్వర్గంలో ఓలలాడింది...

మళ్లీ ఆ వెన్నెలనాటి కమ్మదనాన్ని అందించవూ...
మళ్లీ నాటి సంధ్యా సమయపు క్షణాల్లో ఎదురుచూస్తూ

నీ గూర్చి నేను కన్న స్వప్నాలన్నీ...చెల్లా చెదురు చేసింది నీవే కదా!





హృదయ నేస్తమా
కరిగిపోయిన కమ్మని కలని
జ్ఞాపకం చేస్తావెందుకు?
నీ గూర్చి నేను కన్న స్వప్నాలన్నీ
చెల్లా చెదురు చేసింది నీవే కదా!
నీకోసం యుగాలు నిరీక్షించాలనుకున్నా
నీ కోసం సమస్త ప్రపంచాన్నీ
ఎదిరించాలనుకున్నా
నేనంటే నేను కాదు
నేనంటే నీవే అనుకున్నా
కానీ నువ్వు
నన్ను అగాధంలోకి నేట్టేసావు
శిధిలమయిన
నా హ్రుదయాన్ని ముక్కలు చేశావు
ప్రతి ముక్కలోనూ
నీకోసం వెతికి వెతికి
అలసిపోయాను
కనిపించలేదు శిశిరంలోని రాలిన ఆకులా
హిమ శిఖరం నుండి జారిన తుషారంలా
వానిలా నీకోసం వైతరినిలో మునిగి పోయాను
మళ్ళీ ఇప్పుడు ,ఇన్నాళ్ళకు
నా కళ్ళముందు
చెదిరిన స్వప్నాల మూటని
విప్పమంటావు
ఒక్కో ఆత్మీయపు పలుకరింపు
జోడిస్తావు
జ్ఞాపకాల గాయాల మురళిని
గేయంగా మారుస్తానంటావు
కమ్మని ని పాటకి పల్లవి కమ్మంటావు
ఇదేం..న్యాయం నేస్తమా ...?

Saturday, June 18, 2011

నువ్వొస్తావు..అని ఎదురు చూస్తున్నా...?





నువ్వొస్తావు....అని ఎదురు చూస్తున్నా
మలయ సమీరంతో మంద్ర సముద్రంగా
హొయలు హొయలుగా
కోటి ఊసులను మోసుకొస్తూ...

నువ్వొస్తావు..అని ఎదురు చూస్తున్నా

మండువేసవిలో పండువెన్నెలలా
వలపు పరిమళాలకు చిరు రాగాలను చేరుస్తూ
కోయిల కుహుకుహూలకు శ్రుతి సరిచేస్తూ
రతీ మన్మధంలాగా...

నువ్వొస్తావు అని ఎదురు చూస్తున్నా

భావం, రాగం, తానం,పల్లవి
అన్ని తానైన ప్రణవనాదంలా
మంత్రజగత్తు సరిహద్దులను
సుతారంగా మీటుతూ
వెయ్యి వసంతాల చంద్రోదయంతో..

నువ్వొస్తావు అని ఎదురు చూస్తున్నా

నువ్వూ నేనూ సంగమించే క్షణం...
నువ్వూ నేనూ ప్రణవించే క్షణం..
నువ్వూ నేనూ వూసులల్లుకునే క్షణం..

నువ్వొస్తావు...అని ఎదురు చూస్తున్నా
అమరనాదాలను మోసుకొస్తూ..
నువ్వొస్తావు.. అని ఎదురు చూస్తున్నా

నా గొంతులో ఊపిరి ఆగే వరకు ఎదురు చూస్తూనే ఉంటా...?

చెంగావి చీరకట్టిన చెలి... అందం అద్బుతం..

చెంగావి చీరకట్టిన చెలి, చెంతచేరి మాటాడుతుంటే చెలికాని కనురెప్పలు కొట్టుకుంటాయా? కొంగుమాటున దోబూచులాడే శృంగారం, కనిపించనట్టే కనిపించే సింగారం.. గుబులు రేపకపోతే ఆ చీరకే సిగ్గుచేటు కాదా? ఆ కట్టు... ఆ బొట్టు.. చెంగుమని ఎగిసిపడే ఆ చెంగులు... అందానికి కొమ్ముకాసే కొంగు, సౌందర్యానికే సౌందర్యం కాదా..వన్నెల రాణికి సిరిజోతలను ఏరికూర్చి పెట్టే అందాల పూబోణి చీర.. చీరకట్టిన చిన్నారి వయ్యారంగా నడుస్తుంటే వినిపించే రసధ్వనికి రాయైనా చలించకుండా ఉండేదెలా? చీర కట్టు పవర్ అలాంటిది మరి..కనిపించి కనిపించని అందాలు చూపి చుపనట్టుగా ఊరిస్తుంటే అలాగే కన్నార్పకుండా చూడాలనిపిస్తుంది మరి అది ఆ చీరకట్టులో అందం..ఊరించే అందాలు ఊరకనే ఉంటాయా మరి మనసులు అల్లాడిస్తాయి మరి.ఇలా చీరలో నా ఇష్టసఖి ని చూస్తే మాత్ర్రం నా మనసు మాటవినదు మరి.. ఆ అందాల ఆరబోతలో చెలిని చీర కట్టుకోనే చూడాలి మరి..ఓ మాట అనకూడాదుకాని ఎదురొచ్చు యుద్దానికి సిద్దమా అన్నట్టు ఉండే ఎదపొంగును తన చాటున దాచే పైట గాలిలి అలా ఎగురుతుంటే ..ఇక చెప్పెదెముంది లేమరి కొందరికి సన్నని నడుము అందాలయితే మరికొందరిని నడుమున కనిపించీ కనిపించని మడతల వయ్యారాలు ఆ చీరకట్టులోనే ఉరిస్తూ కనిపించి కనిపించకా ఊపేస్తాయిమరి....మనసు సఖి ఇలాంటి చీరకట్టులో దగ్గరుకు వస్తే చేతులు ఊరకుంటాయా...ఆగండి ఊహల్లోకి వెళ్ళకండి ఆ చీరకట్టు గురించి ఆ అందాల గురించి డీటైల్ గా తెల్సుకోవాలని ఉందా అయితే ఈ ష్టోరి ఒసారి చుడాల్సిందే మరి



ఎలా ప్రియా నన్ను నేను మార్చుకోనేది..ఎలా నిన్ను మరచిపోయేది




రోజుకొకసారి రగిలే ప్రళయాగ్నులు నీకు తెలుసా
గంటకొకసారి పుట్టుకొచ్చే చల్లని మంచు పర్వతాలు తెలుసా
నిమిషానికి ఒకసారి విరబుసే పుష్పాలు నీకు తెలుసా
అర క్షణానికే వాడిపోయే సువాసనలు తెలుసా
ఇవన్ని కలసి ఒకే చోట జరిగే ఆ చోటు తెలుసా
ఆ చోటు నా మదిలో నిక్షిప్తమైతే
అది పడే బాధ తెలుసా
ఆనందానికి కారణం వుండదు ,బాధకు కారణం వుండదు
నవ్వుకి కారణం వుండదు , కారే కన్నిటికి కారణం వుండదు
ఇలా ఏ కారణం లేకుండా సాగే సాగే జీవితం నాది
కారణం లేకుండా నాకెందుకు దూరం అయ్యావో తెలీదు
అందుకే కనిపించని దూరాలకు కానరాకుండా ..
కనుమరుగై పోవలనుంది నాకు
ఎలా నిన్ను మరచిపోయేది

Friday, June 17, 2011

కట్టలు తెంచుకు వస్తున్న నా కన్నీటికి ఆనకట్ట కట్టలేక...




రాయాలని ఉంది నీకొక లేఖ
కట్టలు తెంచుకు వస్తున్న నా కన్నీటికి ఆనకట్ట కట్టలేక...
ఇకపై నిన్ను చూస్తానో లేదో అన్న బాధ గుండె లోతుల్లో దాచుకోలేక...
నువ్వంటే నాకు ఎంత అనురాగమో నీకు చెప్పలేక...
ఈ నా ఆవేదనను ఎవరితో పంచుకోలేక..
రాయాలని ఉంది నీకొక లేఖ

ఒంటరిగా ఉండలేక...
ఎవరినీ కలవలేక..
కలసినా మాట్లాడలేక..
ఆకలి లేక..
నిద్ర రాక..
నిన్ను మరచిపోలేక - అది నాకు చేత కాక..
రాయాలని ఉంది నీకొక లేఖ ..

తడిసిన కనులతో,
అదురుతున్న గుండెతో,
వణుకుతున్న చేతులతో,
బొంగురుపోయిన గొంతుతో ..
రాయాలని ఉంది నీకొక లేఖ ..

నా ఈ బాధకు నువ్వు కారణం అని తెలిసినా..
అందులో నీ తప్పేమీ లేదని తెలిసినా..
నా వల్ల నువ్వు కూడా బాధ పడుతున్నవని తెలిసినా...
నువ్వు నా స్నేహాన్ని వదలవని తెలిసినా..
మనసు ఒప్పుకోక రాయాలని ఉంది నీకొక లేఖ..

నా ఈ పిచ్చి రాతలతో
నిన్ను బాధిస్తే కోపగించక మన్నించుమా నన్నికి..