నీ జ్ఞాపకం
మలయమారుతమై చందనాలను వెదజల్లుతుంది ఒకసారి
నా ప్రేమ
రగిలిపోతూ నిప్పులవర్షం కురిపిస్తుంది మరొకసారి
ఎందుకో అర్థం కాక నిన్నడగాలనుకున్నా
తపన సిరాతో నిండిన నా హృదయాన్ని
అనుభూతి కాగితం మీద అలా ఆన్చానో లేదో...
కాగితం చిరిగిపోయింది, సిరా ఒలికిపోయింది
నా జీవన మధుభాoడమే మట్టిపాలయిందని తెలుసు
కనీసం నీ చుట్టూ అల్లుకున్న నా మనసయినా నీకర్పిద్దామనుకుంటే
అపార్థాల అగ్నిలో దగ్ధమై బూడిదే మిగిలిం