Friday, January 7, 2011
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో
మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో
ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం .....
నిరంతరం కొత్తస్నేహితుల్ని వెతకడం లో నీవు ఎప్పుడూ బిజీ
కొందరు స్నేహితులు ఆయుష్షు అంతవరకే చచ్చేందుకే పుడతారు
నీ లైఫ్ నీయిష్టం ఎవ్వరిని శాశ్వితంగా గుర్తుంచుకోవల్సిన అవసరంలేదు
జీవితంలో తారస పడిన కొందరు స్నేహితులు మద్యిలో పోతారు వాళ్ళని మర్చిపోకు మిత్రమా..?