Tuesday, January 4, 2011
నిలదీసే నా మనసుకు తెలుసు
నిలదీసే నా మనసుకు తెలుసు
నను వదలని నీ తలపుల విలువ......
నిదుర లేని నా కంటికి తెలుసు
నిను చూడలేని ప్రతి క్షణముల విలువ......
అడగలేని నా అడుగుకు తెలుసు
కడకు రాని నీ కదలిక విలువ......
మాట రాని నా మౌనానికి తెలుసు
నను చేరని నీ మాటల విలువ......
ఎవరు చెప్పాలి నాహ్రుదయ వేదన...
ఎప్పటిదాక మిత్రమా ఎన్నాళ్ళిలా ...
కాలం కరిగిపోతుంది కన్నీరు కుడా ఇంకిపోతుంది....
ఇంత కఠినంగా ఎలా ఉండగలుతున్నావు మిత్రమా...
ఓ చట్రంలో చిక్కుక పోయిన గువ్వవా నీవిప్పుడు....
పంజరంలో చిలుకలా మారిపోతావని కలలో కూడా ఊహించ లేదు మిత్రమా..
నీ స్వేచ్చ ఎమైంది..ఎందికిలా మారావు..
మరొకరి బందీగా ఎందుకు మారావు ఉమిత్రమా..
స్వేచ్చగా తిరుగాడే తెల్లని పావురంలా ఉండే నీవు ఇలా ఎందుకు మారావు...
నీ కోసం ప్రతిక్షనం ఆలోచించే ఓ మిత్రుడు ఉన్నాడని గుర్తుందా...?
నీవు ఎంత చెప్పినా నీస్వేచ్చని మరొకరి చేతుల్లో పెట్టావు మిత్రమా..?
ప్రతిక్షనం నీకురించే ఆలోచనలు...అందరిలాంటి వాడను కాదు..
అనుక్షణం నీ తలపులే నీజ్ఞాపకాలే నన్ను దహించి వేస్తున్నాయి మిత్రమా...
అసలు నేను నీకు గుర్తుకు వస్తనా అన్న అలోచన ..పిచ్చెక్కించేస్తుంది..
ఆ పంజరంలో చిలుకల మారావన్ని నిజాన్ని ఇంకా జీర్నించుకోలేక పోతున్నా..
ఇలా నీగురించి ఆలోచిస్తుంటే అన్నీ నెగిటివ్ ఆలోచనలే వస్తున్నాయి మిత్రమా..
కంట్లో కన్నీరు ఇంకిపోతుంది ఒంట్లో సత్తువ పోతుంది..