Friday, July 1, 2011
నీవు నాకిచ్చిన మరువలేగి బహుమానం ఇదే కదా..
ఎంత మందిలో ఉన్న నా వెనువెంటే ఉంటూ ....
కలత సమయాన నా కన్నీరు లో నిలుస్తు.....
ఓటమి వేల గుండె పొరలో దుక్కాని పంచుకుంటూ.......
నిరీక్షించే వేల మనసు లోతున ఏకాంతానికి తోడుగా నిలుస్తు ......
చీకటి లో వెలుగును చూపుతో....
ఓటమి లో విజయం ఉందని ధైర్యం చెప్తూ....
కన్నీరు వెనుక చిరునవ్వులు ఒలికించే ఆనందం ఉందని ...
ఏది ఏమైనా ఈ ప్రపంచం లో .....నాకు తోడుగా నీడగ ...
నామనో భావాలను అర్ధం చేసుకుంటూ ....
నన్ను నన్నుగ ప్రేమించే ప్రేమను చూపిస్తూ ....
ఎప్పటికి ఏనాటికి నేను ఒంటరిని కాను అని
నాపక్కన కూర్చొని .. నేను ఉన్నాను అంటుంది..నా ఒంటరితనం
నీవు నాకిచ్చిన మరువలేగి బహుమానం ఇదే కదా..
మరికలోకంలో మరొకరి...నీవు హాయిగా నన్ను మరచి ..
జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావు ...నేను నిన్ను ప్రతిక్షనం తలచుకొంటూ ఇలా..?
Labels:
కవితలు