ఓ ప్రేమా ఎక్కడున్నావ్?
నా ఆశలోనా..నీ కోసం వొదిలేసే శ్వాసలోనా?
ఓ ప్రేమా ఎక్కడికెళ్ళావ్?
తీరాన్ని వొదిలెల్లే అలలా
...దూరాన్ని దరిచేర్చే దిశలా.
ఓ ప్రేమా ఎందుకెళ్ళావ్?
చిగురించిన చిన్ని ఆశలను చితి మంటకు చేర్చేందుకా,
గుండె పగిలిన ప్రేమికుడి రోదనతో మరో ప్రేమ సౌధాన్ని పేర్చేందుకా!
5) నిను అందుకోవాలనుకున్నాను నేస్తమా,
కానీ అందనంత ఎత్తులో ఒదిగిపొయావు సుమా!
నిను కళ్లలొ దాచుకోవాలనుకున్నాను నేస్తమా,
కంటి ముందే కలవై కరిగిపోయవు సుమా!
అలగా నీ ప్రణయ తీరాన్ని చేరుకోలేక,
శిలగా మారిపోతున్నాను,
ఒక బండ గా ఉండిపోతున్నన్నాను...ఈ నాటికి!
నిను చేరేనా ఏ నాటికీ?