Thursday, July 28, 2011
చూపులకే తప్ప దేహంలోని మరే భాగానికి చలనం రానంటుంది...
మౌనాన్ని ప్రేమిస్తున్నా...
నీ మాటలు నాకు చేరడంలేదు కదా...
నిన్ను తాకే గాలిని సైతం ప్రేమిస్తున్నా...
నిను తాకి నను చేరుతోందని...
పగటిపూట కూడా నిద్ర పోవాలనుకుంటున్నా...
స్వప్నంలో నిన్ను చూడొచ్చని...
రాత్రుల్లు నిద్రలేకుండా గడుపుతున్నా..
కన్నీళ్ళలో ఉన్న నీవు కరిగి పోతావేమో అని
నీ పాద స్పర్శ తగిలిన నేలను చూచి ఈర్ష పడుతున్నా...
ఆ భాగ్యం నాకు కలగలేదని...
అయినా ఏమీ చేయలేక నిస్సహాయంగానే నిల్చున్నా...
ఎందుకంటావా...
నిన్ను చూచినవేళ నా మాట మౌనమవుతుంది...
చూపులకే తప్ప దేహంలోని మరే భాగానికి చలనం రానంటుంది...
అయినా హృదయాన్ని వీడిపోని ఆశ మాత్రం నిన్ను చేరాలని తపిస్తూనే ఉంటుంది...
నిను చేరే భాగ్యం ఏనాటి కలిగేనో అని వేచి చూచే నా చిన్ని హృదయానికి ఏమని చెప్పను...
దాని ఆశను నెరవేర్చే ధైర్యం నాకు లేదని... జరిగే అవకాశం లేదని
Labels:
కవితలు