Tuesday, July 26, 2011
పంచదార పెదవులతో వేసే ఈ పూలబాణం
నా కళ్ళలో కధలాడే ఓ వర్ణాల పూలవానా...
తొలకరి మెరుపులు చిలికిన తొలి చినుకులు
విరభూసే గాలి గంధంలా ఆ నింగిన ఆగేనా ...
హాయిగా పండు వెన్నెలని పంచే ఈ రేయి
చీకటే దారిగా వేక్కువను చేరేనా ...
మిణుగురు పురుగుల చిరు వెలుగులు
పండు వెన్నలని పంచే జాబిలినై కాయునా ...
చెరువుల కడుపున విరిసిన తామర తీగలు
గాలిలో మబ్బు రేకుల్లా తేలియాడేనా...
నా మదిలోత్తులలో చిత్రించిన నీ రూపం
కదిలే కల్లల సరిగమై నా కళ్ళను వీడేనా ...
పొద్దే లేని ఈ ఆకాశం నా కళ్ళకి సరిహద్దు వేసింది
హద్దేలేని ఆ ఆనందం ఈ చీకట్టిలో నన్ను మరచింది
ఈ రంగుల వలయంలో రాగాలెన్నో తీస్తునా ...
ఆ గాలి మేడల్లో దీపానై వెలిగేనా ...
పంచదార పెదవులతో వేసే ఈ పూలబాణం
తేన్నెల జలపాతంలా నీ మదిని చేరేనా ......
Labels:
కవితలు