Thursday, July 7, 2011
కలలన్ని కధలయ్యయి, కన్నిళ్లే వరమయ్యయి...
నిండి పొయింది నా మనసు నీ రూపంతో ఒకనాడు,
అదే నా మనసు నిండి పొయింది బాధలో నీ లేమితొ ఈనాడు,
కలలన్ని కధలయ్యయి, కన్నిళ్లే వరమయ్యయి
వెన్నెల సైతం కాల్చెస్తుంది నీ విరహ వేదన తొ,
ఆగదు నా హ్రుదయం ఈ క్షణం నీవు లేవని,
ఎదురు చూస్తుంది నీవు వచ్చె క్షణం కొసం
రావని తెల్సు రాలేవని తెల్సు...
కాని పిచ్చి మనస్సు ఊరుకోదుగా..
ఒకప్పుడు జరిగిన వన్నీ నిజాలని నమ్మాను..
ఇప్పుడు జరుగుతున్నవి నిజాలు కాకూడడని భాద పడుతున్నా..
ఎంజరుగుతుందో తెలీదు..ఏంజరగ బోతోందో తెలీదు..
మనస్సు నిండా తట్టుకోలేని భాద..
నేనిలా భాదపడుతున్నానని తెల్సి నీవు హేపీగా..?
ఇలా ప్రతి క్షనం పిచ్చి ఆలోచనలు గుండెళ్ళో ఆందోళన ..
ఏం చేయగలను నీవు నన్నెందుకిలా చేశావని అడగనా..
అడిగినా చెప్పే తీరిక నీకు లేదుగా ...ప్రియా..
Labels:
కవితలు