Thursday, July 21, 2011
కనుపాపలు కురవనివ్వని కన్నీటి వర్షం ...నిన్ను మరవనివ్వదు ...
మరవనివ్వదు .....మరపురానివ్వదు .......
మజిలిలో మలిగా తాకిన నీ ఊపిరి స్వరం మరవనివ్వదు
పెదవి చెర దాటని గుండె లోని భావం మరవనివ్వదు
కనుపాపలు కురవనివ్వని కన్నీటి వర్షం ...నిన్ను మరవనివ్వదు ...
కనిపించే నీ నయనం విడిచిన భాష్యాల బాణం మరపురానివ్వదు
ఆశించని నీ కరమిచ్చిన తొలి చెలిమి వరం మరపురానివ్వదు
మరలా మరలని అడుగుల దురాల పయనం మరపురానివ్వదు
మరో క్షణమైనా నిరీక్షించని ఆ ఆఖరి క్షణం మరపురానివ్వదు
తరువాత యుగాన్ని తలపించిన నిజాల నిమిషం మరపురానివ్వదు...... నిన్ను
"కదిలే కాలం తన కాళ్ళ కింద నా హృదయాన్ని అణిచివేస్తున్నా ,
మరణించే కాలం మిగిలిఉండే వరకు నా చెలియ మరవనివ్వదు.. తన చెలిమి మరపురానివ్వదు .. "
Labels:
కవితలు