కలవడానికి చేతులవసరం లేదు
కలసిన ఇరువురి స్వచ్చమైన భావాలు చాలు
మాటలు అంత కంటే అవసరం లేదు
మన ఇద్దరి మధ్య క్షణ కాల మౌనం చాలు
ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి,
మనసుని దోచుకోవటానికి
నన్ను చేరడానికి కాళ్ళు అవసరం లేదు
నీ హృదయం లో నా తలపు చాలు
నాగురించి నువ్వు ఆలోచిస్తున్నావని తెలియడానికి
చేరువలో లేకున్నా, ప్రేమను పంచడం లో ఆప్యాయతను పంచడం లో
నువ్వు ఎప్పుడు నా చెంత నుంటా వని నా మనసుకు తెలుసు
ఈ చిన్ని గుండెకి సంతృప్తి నించే ఆ ఆలోచన చాలు ..
ఇలా ఎన్నాళ్ళో తెలీదు ప్రియా ఊపిరి ఉన్నంత వరకేగా..
నాకు తెల్సి నాలా నీవు ఎవ్వరిని భాద పెట్టి ఉండవు కదా..?
ఆ అదృష్టం నాకే ఎందుకు దక్కిచావో కదా...?