Sunday, July 24, 2011
ఉప్పెనవై నామనసును నా నుండి దూరంగా తీసుకెళ్ళిపోయావు,
జ్యొతివై నా చీకటి హృదయంలో వెలుగు నింపుతావనుకున్నాను,
కాని జ్వాలవై నా హృదయాన్ని మండిస్తున్నావు,
ఐనా ఆనందమే నీ చూపుల జ్వాలలలో మండుతున్నందుకు.
అలవై నా మనసుతీరం తాకుతావనుకున్నాను,
కాని కలవై నన్ను విరహసంద్రంలోకి తోసేశావు,
ఐనా ఆనందమే నీ మనసులోతు తెలుసుకుంటున్నందుకు.
నింగివై నీ ప్రేమ జల్లులలో నన్ను తడుపుతావనుకున్నాను,
కాని పిడుగువై నా గుండెని బూడిద చేశావు,
ఐనా ఆనందమే నీ కన్నుల కాంతిలో నా గుండె బూడిదైనందుకు.
ఊపిరివై నా గుండెలో నిండిపోతావనుకున్నాను,
కాని ఉప్పెనవై నామనసును నా నుండి దూరంగా తీసుకెళ్ళిపోయావు,
ఐనా ఆనందమే నన్ను వదిలిన నా మనసు నీతో వెళ్ళిపోయినందుకు.
భువివై నన్ను నీ ఓడిలో దాచుకుంటావనుకున్నాను,
కాని భూకంపమై నీ మాటల ప్రకంపనాలతో నా ప్రాణం తీశావు,
ఐనా ఆనందమే నేను మరణించినా నా తనువు నీలో ఐక్యమవుతున్నందుకు
Labels:
కవితలు